Asia Cup 2023: ఫైనల్ పోరుకు సర్వం సిద్దం ఇండియా తో పోటీ పడే టీమ్ ఏది అంటే..?

ఒకవేళ పాకిస్తాన్ కనుక ఫైవ్ ఫైనల్ కి చేరుకుంటే మరొకసారి ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక భారీ మ్యాచ్ ని మనం చూడవచ్చు అలా కాకుండా పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ లో వర్షం కనక వచ్చినట్టయితే ఆ మ్యాచ్ ను రద్దు చేయడం జరుగుతుంది.

Written By: Gopi, Updated On : September 14, 2023 10:32 am

Asia Cup 2023

Follow us on

Asia Cup 2023: ఆసియా కప్ లో భాగంగా ఇప్పటికే భారత్ ఫైనల్ కి వెళ్ళింది. ఇక ఇప్పుడు ఇండియాతో పాటు ఫైనల్ లో తలపడే టీం ఏది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.దాంతో ప్రస్తుతం ఫైనల్ కి ఎవరు చేరుకుంటారు అనే దాని పైన తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఇండియా మీద మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉంది. అలాగే శ్రీలంక పాకిస్తాన్ ను ఓడించి ఎలాగైన ఫైనల్ కి వెళ్లి ఇండియా తో ఫైనల్ మ్యాచ్ ఆడాలని వీలైతే ఇండియాని ఓడించాలని చూస్తుంది. అయితే ఇప్పుడు ఫైనల్ కి ఏ జట్టు చేరుకుంటుంది అనే దానిపైన సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఒకవేళ పాకిస్తాన్ కనుక ఫైవ్ ఫైనల్ కి చేరుకుంటే మరొకసారి ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక భారీ మ్యాచ్ ని మనం చూడవచ్చు అలా కాకుండా పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ లో వర్షం కనక వచ్చినట్టయితే ఆ మ్యాచ్ ను రద్దు చేయడం జరుగుతుంది. దాంతో చేరోక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇప్పటికే రన్ రైట్ పరంగా శ్రీలంక పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉండటం వల్ల వీళ్లు ఫైనల్ కి చేరుకునే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ఏ టీం ఫైనల్ కి చేరుకున్న ఇండియా మాత్రం చాలా జాగ్రత్తగా ఫైనల్ మ్యాచ్ ఆడి ఏషియా కప్ ని గెలవాలని చూస్తుంది గడిచిన రెండు మ్యాచ్ ల్లో రోహిత్ శర్మ తనదైన ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడి ఇండియా భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర అయితే పోషించాడు.ఇక కోహ్లీ కూడా ఒక మ్యాచ్ లో సెంచరీ చేసి తను కూడా ఫామ్ లో ఉన్నాడని మరోసారి ప్రూవ్ చేశాడు.ఇలా ఇండియన్ బ్యాట్స్ మెన్స్ అందరూ కూడా మంచి ఫామ్ లో ఉండటం ఇండియాకి బాగా కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. ఇక బౌలర్ల విషయానికి వస్తే బుమ్రా గానీ,కుల్దీప్ యాదవ్ ,రవీంద్ర జడేజా లాంటి బౌలర్లు మంచి ఫామ్ లో ఉండి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ని బాగా ఇబ్బంది పెడుతున్నారు…