https://oktelugu.com/

Bangara movie: బంగారం సినిమాలో ఉన్న ఈ క్యూట్ బ్యూటి ఇప్పుడేలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ కథలో కొన్ని మిస్టేక్స్ ఉండటం వల్లే ఈ సినిమా అంత పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చెల్లిగా ఒక అమ్మాయి నటించింది.

Written By:
  • Gopi
  • , Updated On : May 7, 2024 / 10:50 AM IST

    Do you know how this cute beauty in Bangara movie looks now

    Follow us on

    Bangara movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద భారీ అంచనాలే ఉంటాయి. ఎందుకంటే ఆయన సినిమాలు ఒకప్పుడు భారీ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ధరణి దర్శకత్వంలో 2006 వ సంవత్సరంలో వచ్చిన బంగారం సినిమా భారీ అంచనాలతో వచ్చినప్పటికీ ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

    ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ కథలో కొన్ని మిస్టేక్స్ ఉండటం వల్లే ఈ సినిమా అంత పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చెల్లిగా ఒక అమ్మాయి నటించింది. అందులో ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది ఏ సినిమాలో నటిస్తుంది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

    ఇక బంగారం సినిమాలో నటించిన ఆ అమ్మాయి పేరు సనూష…ఈమె ప్రస్తుతం హీరోయిన్ గా పలు సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది. ఇక ఇప్పటికే ఈమె చాలా సినిమాల్లో నటించి నటిగా కూడా మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంది. ముఖ్యంగా ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులు ఆమె గురించి మాట్లాడుకునేలా ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

    ఇక సనూష 2012 వ సంవత్సరంలో ‘మిస్టర్ మురుగన్’ అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న విజయాన్ని సాధించకపోవడంతో ఆమెకు సరైన అవకశాలైతే రాలేదు. ఇక ఆ తర్వాత రేణిగుంట, జీనియస్ లాంటి సినిమాల్లో కూడా నటించి నటి గా మంచి గుర్తింపైతే సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. అలాగే ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా కొన్ని సినిమాలను చేయడానికి రెఢీ అవుతుంది.

    ఇక సోషల్ మీడియాలో ఈమె ను చూసిన చాలామంది బంగారం సినిమాలో ఉన్న ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకరే అని చెబితే నమ్మలేక నోరేళ్లబెడుతున్నారు. ఎందుకంటే ఆ సినిమా లో చాలా క్యూట్ గా, బొద్దుగా, ముద్దుగా ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా అలాగే ఉన్నప్పటికి ఆమెలో ఇంత మార్పు ఎలా వచ్చింది అంటూ చాలామంది చాలా రకాలుగా కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఈమె ఫోటో లు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…