Chiru Navvutho Heroine: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ప్రతి ఒక్కరికీ ఓ గుర్తింపు ఉంటుంది. వీరిలో ప్రముఖంగా త్రివిక్రమ్ గురించి చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగ్స్ అదుర్స్ అన్నట్లుగా ఉంటాయి. మొదట్లో కొన్ని సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు త్రివిక్రమ్. ఆ సినిమాలో డైలాగ్స్ తోనే హిట్టుకొట్టడం విశేషం. అలా కేవలం డైలాగ్స్ తోనే సక్స్ సాధించిన మూవీ ‘చిరునవ్వుతో’. ఎస్ పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వేణు హీరోగా వచ్చిన ఈ సినిమా స్టోరీ కామనే అయినా ఇందులో డైలాగ్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. పంచ్ డైలాగ్ లతో నే ఈ మూవీ హిట్టయిందని చెప్పుకుంటారు. ఇందులో నటించిన హీరోయిన్ గుర్తుందా? ఆమె ఇప్పుడెలా ఉందో తెలుసా?
‘చిరునవ్వుతో’ సినిమాలో వేణుకు జోడిగా నటించింది షాహిన్ ఖాన్. ఇది ఆమెకు డెబ్యూ మూవీ. అయినా ఎంతో అనుభవం ఉన్న నటిగా యాక్ట్ చేసింది. గ్లామర్ ఆరబోయడంలో ఏమాత్రం తగ్గకుండా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాలో వేణుతో పాటు ప్రకాశ్ రాజ్ ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా కనిపిస్తుంది. వేణు, షాహిన్ ఖాన్, ప్రకాశ్ రాజ్ ల మధ్య జరిగే సీన్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా వేణు, షాహిన్ ఖాన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో సినిమాను యూత్ ఆదరించారు.
షాహిన్ ఖాన్ ఈ సినిమాలో నటించిన తరువాత ఫేమస్ అయ్యారు. దీంతో ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందని అనుకున్నారు. కానీ అనుకున్నట్లు జరగలేదు. ఈ సినిమా తరువాత ‘డార్లింగ్ డర్లింగ్’ అనే సినిమాలో శ్రీకాంత్ తో కలిసి నటించింది. ఈమూవీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అమెకు ఆ తరువాత అవకాశాలు రాలేదు. అయితే చిరునవ్వుతో సినిమాను తమిళం, కన్నడంలో రీమేక్ చేశారు. ఈ సినిమాలో షాహిన్ ఖాన్ హీరోయిన్ గా నటించింది.
ఆ తరువాత అవకాశాల కోసం ఎదురుచూసిన షాహిన్ ఖాన్ కు నిరాశ తప్పలేదు. దీంతో సిద్దంత మహా పాత్ర అనే నటుడు, గాయకుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత షాహిన్ మళ్లీ సినిమాల వైపు చూడలేదు. కానీ సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన తాజాఫొటోలు వైరల్ అవుతున్నాయి. దాదాపు 22 ఏళ్ల తరువాత షాహిన్ ను చూసి అంతా షాక్ అవుతున్నారు. అప్పుడున్న అందం, ఆకర్షణ ఇప్పుడు మాయమయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా మారిన షాహిన్ ను మీరు చూడండి..
View this post on Instagram