‘గీత గోవిందం’లో లెక్చరర్(విజయ్) ను ప్రేమించే అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

ఈమె పేరు అనీషా దామా. గీత గోవిందం సినిమాలో నీలు పాత్ర గురించి ఎవరూ మరిచిపోరు. లెక్చరర్ అయిన విజయ్ ని ప్రేమిస్తున్నానని చెబుతుంది. ఆ తరువాత ఓ వీడియోను పంపుతుంది. ఈ వీడియో కారణంగా ముందగా విజయ్ ని అపార్థం చేసుకున్న రష్మిక..

Written By: Chai Muchhata, Updated On : May 24, 2024 11:55 am

Geetha Govindam Aneesha Dhama

Follow us on

సినిమాల్లో ఒక్క ఛాన్స్ వస్తే తమ జీవితం మారిపోతుందని చాలా మంది అనుకుంటారు. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశం వచ్చినా వదులు కోరు. అలా చాలా మంది చిన్న చిన్న పాత్రలు వేసి ఆ తరువాత స్టార్ హీరోయిన్లు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే 2019లో రిలీజ్ అయిన ‘గీత గోవిందం’ సినిమాలో నటించిన ఓ భామ ఇప్పుడు హీరోయిన్ లెవల్లో మారిపోయింది. గీత గోవిందం మూవీలో చిన్న పిల్లలా కనిపించిన ఈ మె ఇప్పుడు ఎలా ఉందంటే?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ మలుపు తిప్పిన సినిమా ‘గీత గోవిందం’. అప్పటి వరకు విజయ్ పలు సినిమాల్లో నటించినా.. ఎవరూ ఆయనను గుర్తించలేదు. కానీ ఈ మూవీ తరువాత విజయ్ కి స్టార్ లెవల్ పాపులారిటీ వచ్చింది. గీత గోవిందం సినిమా ద్వారా విజయ్ కి మాత్రమే కాకుండా హీరోయిన్ గా నటించిన రష్మిక మందానా కు సైతం పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ పెరిగారు. అయితే ఈ మూవీలో మరో అమ్మడు గురించి చెప్పకోవాలి. విజయ్ ని లవ్ చేస్తానంటూ ఓ అమ్మాయి వెంటపడుతుంది. కానీ విజయ్ రిజెక్ట్ చేస్తాడు. ఆమె కనిపించింది కొంతసేపు అయినా సినిమా కథను మలుపు తిప్పడంలో సాయపడుతుంది.

ఈమె పేరు అనీషా దామా. గీత గోవిందం సినిమాలో నీలు పాత్ర గురించి ఎవరూ మరిచిపోరు. లెక్చరర్ అయిన విజయ్ ని ప్రేమిస్తున్నానని చెబుతుంది. ఆ తరువాత ఓ వీడియోను పంపుతుంది. ఈ వీడియో కారణంగా ముందగా విజయ్ ని అపార్థం చేసుకున్న రష్మిక.. ఆ తరువాత ఈమె ద్వారానే నిజం తెలుసుకుంటుంది. అప్ప టి నుంచి విజయ్ ని ప్రేమిస్తుంది. అయితే అనీషా దామా ఇందులో కాస్త రాష్ గా నటించింది. ఆ తరువాత ఈమెకు కొన్ని అవకాశాలు కూడా వచ్చాయి.

‘వయా పాపి కొండలు’ అనే సినిమా ద్వా రా సినీ ఎంట్రీ ఇచ్చిన అనీషా ఆ తరువాత ‘ఓ బేబీ’ సినిమాలోనూ నటించింది. అలాగే ‘సత్తిగాని రెండు ఎకరాలు’ మూవీలో కనిపించి అలరించింది. ఈ మూవీ థియేటర్లోకి కాకుండా ఓటీటీలో రిలీజ్ అయింది. అయతే అనీషా ఏ సినిమాలో నటించినా అందంగా కనిపించి ఆకట్టుకుంటోంది. లేటేస్ట్ గా ఆమె ఫ్యాషన్ ఫొటోలతో అలరిస్తుంది. ఇందులో హాట్ హాట్ గా కనిపిస్తున్న అనీషాను చూసి కొందరు నెటిజన్లు ప్రత్యేకంగా కామెంట్లు పెడుతున్నారు.