కార్ల ఉత్పత్తిలో మహీంద్రా కంపెనీది ప్రత్యేకం అని చెప్పవచ్చు. SUV మోడళ్లను ఉత్పత్తి చేయడంలో ఈ కంపెనీ ముందు ఉంటుంది. ఇప్పటికే వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చిన మహీంద్రా ఎప్పటికప్పుడు లేటేస్ట్ మోడళ్లతో ఆకట్టుకుంటుంది. లేటేస్ట్ గా ఈ కంపెనీ ఉత్పత్తి చేసి న XUV 3×0 మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే ఈ కారు గురించి వివరాలు బటయకు రావడంతో కారు ప్రియులు ఇంప్రెస్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ కారు బుకింగ్ ప్రారంభమైన గంటలోనే 50,000 ఆర్డర్లు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఈ కారులో ఏముందంటే?
మహీంద్రా XUV 3×0 మే 26న మార్కెట్లోకి రానుంది. కానీ ఇప్పటికే ఈ కారును 50 వేల మంది బుక్ చేసుకున్నారు. ఈ మోడల్ లో 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. వీటితో పాటు 1.2 లీటర్ గ్యాసోలిన్ ఇంజిన్ కూడా ఉంది. ఇది 115 బీహెచ్ పీ పవర్ 200 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన 117 బీహెచ్ పీ పవర్ వద్ద 300 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 10.25 అంగుళాల డిజిట్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా సిస్టమ్ ఉన్నాయి. ఈ మోడల్ ను 7.49 లక్షలతో విక్రయిస్తున్నారు.
మహీంద్రా XUV 3×0 మొత్తం 9 వేరియంట్లలో లభించనుంది. వీటిలో MX1, MX2 Pro, MX3 Pro, AX5, AX5 లగ్జరీ తో పాటు AX7 ప్రముఖమైనవి. వీటిలో కొన్ని వేరియంట్లు మాత్రమే బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. మిగతావాతి జూలైలో డెలివరీ అయ్యే అవకాశం ఉంది. మహీంద్రా కార్లకు ఉన్న డిమాండ్ ఆధారంగా ఈ కంపెనీ లేటేస్ట్ టెక్నాలజీతో XUV 3×0ని ఉత్పత్తి చేసింది. అనుకున్నట్లుగానే ఇప్పటికే కళ్లు చెదిరే బుకింగ్ వచ్చాయి.