The Elephant Whisperers: నిన్న ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీ లో #RRR మూవీ కి ఆస్కార్ అవార్డు వచ్చింది, ఇది నిజంగా అందరూ గర్వించదగినదే,ఇండియన్ సినిమా నుండి నామినేషన్స్ దక్కించుకొని ఆస్కార్ గెల్చుకున్న మొట్టమొదటి సినిమా ఇది.అదే సమయం లో తమిళ ఇండస్ట్రీ నుండి ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ అనే డాక్యుమెంటరీ చిత్రానికి కూడా ఆస్కార్ అవార్డు దక్కింది.

350 కోట్ల రూపాయలతో నిర్మించిన #RRR చిత్రానికి ఎలాంటి గౌరవం దక్కిందో, కేవలం పది లక్షల రూపాయిల బడ్జెట్ తో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఆస్కార్ అవార్డుని దక్కించుకున్న ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ కి కూడా అలాంటి గౌరవమే దక్కింది.ఇంత తక్కువ బడ్జెట్ తో తీసి పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రభంజనం సృష్టించిన ఒక సినిమాతో సరిసమానంగా నిలబడి ఆస్కార్ అవార్డు గెలుచుకునేంత గొప్ప కంటెంట్ ఇందులో ఏముంది..? కేవలం 45 నిమిషాల నిడివి ఉన్న లఘు చిత్రం తో ఇంతటి అద్భుతం ఎలా సాధ్యపడింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ అనే తమిళ డాక్యుమంటరీ కి దర్శకురాలు కార్తీకీ గొంసాల్వేస్.ఈమెకి ఇదే తొలి సినిమా.వైల్డ్ లైఫ్ మీద గొప్ప అభిప్రాయం ఉన్న ఈమె, ఒక చక్కటి డాక్యుమంటరీ తియ్యడానికి నడుము బిగించింది.’రఘు’ అనే ఏనుగు పిల్ల ఒకరోజు గాయం తో రోడ్డు మీద పది ఉండడం ని చూసిన ఇద్దరు గిరిజనులు తమ ఇంటికి ఆ ఏనుగు పిల్లని తీసుకొని తమ కుటుంబం లో ఒక మనిషి లాగ సాకడం మొదలు పెడుతారు.వాళ్ళ జీవిత ప్రయాణం లో ‘రఘు’ అనే ఏనుగుతో ఏర్పడిన ఒక అద్భుతమైన అనుబంధం, దానితో వాళ్ళిద్దరికీ ముడిపడి ఉన్న ప్రేమ, భావోద్వేగాలు వంటివి చాలా చక్కగా హృదయం గా తీర్చి దిద్దింది కార్తీకీ.
కేవలం 45 నిమిషాల వ్యవధిలో ఇంత గొప్పగా ఎమోషన్స్ ని చూపించడం అనేది చాలా కష్టం.అలాంటి కష్టతరమైన టాస్కుని అంత తక్కువ బడ్జెట్ తో తక్కువ నిడివి లో చూపించినందుకే ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కింది.నెట్ ఫ్లిక్స్ సంస్థ నుండి ఇలాంటి డాక్యుమంటరీలు మరిన్నీ రావాలని,అవి కూడా ఇలాగే ఆస్కార్ అవార్డ్స్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.