7/g Brindavan Colony Hero: సినిమా ఇండస్ట్రీలోకి వారసత్వంగా వచ్చిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వీరిలో కొందరు తమ జీవితాలను సక్సెస్ చేసుకోగా..మరికొందరు మాత్రం ఆశించిన విజయాలను అందుకోలేకపోయారు. కొందరు స్టార్ హీరోలయిన తరువాత తమ కుమారులను సినీ రంగంలోకి దింపారు. ఆ తరువాత డైరెక్టర్లు, నిర్మాతలు కూడా తమ కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలాగే ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం తన కుమారుడిని స్టార్ హీరోగా చూడాలని ఆశపడ్డాడు. ఈ నేపథ్యంలో ఓ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. ఫస్ట్ మూవీతో సంచలన విజయం సాధించిన ఆయన ఆ తరువాత అవకాశాల్లేక ఖాళీగా కూర్చుంటున్నాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
7/G బృందావన్ కాలనీ మూవీ పేరు చెబితే చాలు.. ఆనాటి యూత్ గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్. లవ్ ఎమోషనల్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ఏఎం రత్నం కుమారుడు రవి కృష్ణ హీరోగా పరిచయం అయ్యాడు. అమాయక చక్రవర్తిలా నటిస్తూ ఓ అమ్మాయిని ప్రేమించి, ఆ తరువాత ఎటువంటి కష్టాలు ఎదుర్కున్నాడోనని వివరించే కథ నేపథ్యంలో సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా నటించగా సోనీ అగర్వాల్ హీరోయిన్ గా అలరించింది. వీరిద్దరికి ఇదే మొదటి మూవీ అయినా తమ నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. రవికృష్ణ కు డెబ్యూ మూవీ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా వచ్చింది.
బృందావన్ కాలనీ సినిమా తరువాత రవి బ్రహ్మానందం డ్రామా కంపెనీ, నిన్న నేడు రేపు అనే తెలుగు సినిమాల్లో నటించారు. ఈ మూవీస్ పెద్దగా పేరుకు రాకపోవడంతో అయనకు అవకాశాలు తగ్గాయి. దీంతో తమిళ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో నటించారు. అక్కడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో సినిమాలు తీయకుండా ఖాళీగా ఉన్నారని తెలుస్తోంది. అయితే అప్పటికీ ఇప్పటికీ రవి పూర్తిగా మారిపోయాడు. ఇటీవల ఆయన లేటేస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో ఉన్న ఆయనను చూసి షాక్ అవుతున్నారు.
అయితే 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ తీస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇందుకోసం రవి సిద్ధమవుతున్నాడట. ఈమధ్య ప్రతీ మూవీ రెండు పార్ట్ లుగా వస్తోంది. అప్పట్లో యూత్ ను బాగా ఆకట్టుకన్న ఈ సినిమా పార్ట్ 2ను ఎలా చూపిస్తారోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇక పార్ట్ 1 లో నటించిన సోని అగర్వాల్ సైతం అవకాశాల్లేక సినిమాలకు దూరంగా ఉంది. దీంతో ఆమెను మరోసారి ఈ సినిమాలకు తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.