IPhone 15 Release: ప్రపంచం ఇప్పుడు మొబైల్ వలలో చిక్కింది. ప్రతి ఒక్కరూ ఏదో అవసరం కొద్దీ స్మార్ట్ ఫోన్ ను కలిగి ఉంటున్నారు. కొందరు సాధారణ పనుల కోసం తక్కువ ధరకు లభించే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. వీటిలో ఆండ్రాయిడ్ ఎక్కువగా ఉన్నాయి. కానీ సెక్యూరిటీతో పాటు, అదిరిపోయే ఫీచర్స్ ఉండే యాపిల్ ఫోన్ ను సొంతం చేసుకోవాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. కానీ వీటి ధరలు ఆకాశంలో ఉండడంతో తక్కువ మంది మాత్రమే కొనుగోలు చేయగలుగుతారు. కొందరు వీటిపై ఉన్న ప్రేమతో ఎంత ఖర్చుపెట్టయినా దక్కించుకుంటారు. లేటేస్టుగా యాపిల్ ఫోన్ కంపెనీ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. అదేంటో చూద్దాం..
మొబైల్ కంపెనీల్లో హైఫై రేంజ్ ఉండే యాపిల్ కు మించి మరొక కంపెనీ రాదని టెకీల అభిప్రాయం. వినియోగదారులను రోజురోజుకు పెంచుకుంటూ పోతున్న యాపిల్ సంస్థ ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ లో కొత్త మోడల్ ను ప్రవేశపెడుతుంది. లేటేస్టుగా ఈ కంపెనీకి చెందిన ఐ ఫోన్ 15 ఫ్రో, ఐఫోన్ 15 ఫ్రో మ్యాక్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఐ ఫోన్ 15 ను విడుదల చేయాలని సంకల్పించింది. అయితే అనుకున్న సెప్టెంబర్ నాటికి ఈ మొబైల్ వచ్చే అవకాశం లేనట్లే తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు.
ఇప్పటి వరకు ఐఫోన్ వాడుతున్న వారిలో డిస్ ప్లే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవి ఐఫోన్ స్టోర్లో తప్ప ఎక్కడా లభించవు. ఇప్పటి వరకు ఉన్న మోడళ్లలో ఫోన్ 15 ఫ్రో, ఐఫోన్ 15 ఫ్రో కు సంబంధించిన డిస్ ప్లేలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టే ఐ ఫోన్ 15కు సంబంధించిన వి అందుబాటులో లేవు. దీంతో ఈ ఫోన్ ను నిర్ణీత సమయంలో రిలీజ్ చేయడం కుదరదని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీంతో యాపిల్ 15ను దక్కించుకోవాలనుకొని ఆశపడిన వారికి నిరాశే ఎదురయినట్లయింది.
ఇదిలా ఉండగా ఐఫోన్ 15 ఫోన్ కు సంబంధింిచ బెజెల్స్ పరిణామానాన్ని తగ్గించి ఎల్ జి తయారు చేస్తుంది. అయితే ప్రస్తుతం దీనికి సంబందించిన ఉత్పత్తులు అందుబాటులో లేకపోవడంతో ఐఫోన్ ను రిలీజ్ వాయిదా వేశారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన యాపిల్ వాచ్ 7 విషయంలో ఇవే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇవి మార్కెట్లోకి వచ్చిన నెల తరువాత డిస్ ప్లే ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పడు ఆదేసమస్య రాకుండా ఐపోన్ 15ను వాయిదా వేశారు.