Shravanthi Sainath: లైఫ్ ఆఫ్ పై సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Shravanthi Sainath: 2001 లో యాన్ మారెటెల్ అనే రచయిత రాసిన లైఫ్ ఆఫ్ పై అనే నవల ఆధారంగా అంగ్ లీ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఒక యువకుడు తన యంగ్ ఏజ్ లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.

Written By: Gopi, Updated On : July 6, 2024 4:31 pm

Shravanthi Sainath

Follow us on

Shravanthi Sainath: కొన్ని సంవత్సరాల క్రితం హాలీవుడ్ లో వచ్చిన ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా మనిషి యొక్క జీవితానికి సంబంధించిన కొన్ని జీవితపు సత్యాలను కూడా ఈ సినిమా జనాలకు తెలియజేసింది. హాలీవుడ్ మేకర్స్ రూపొందించిన ఈ సినిమా విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కడమే కాకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని కూడా టచ్ చేస్తుందనే చెప్పాలి…

2001 లో యాన్ మారెటెల్ అనే రచయిత రాసిన లైఫ్ ఆఫ్ పై అనే నవల ఆధారంగా అంగ్ లీ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఒక యువకుడు తన యంగ్ ఏజ్ లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అనే ఒక కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కింది..పై పటేల్ పాండిచ్చేరిలో ఒక జూ యజమాని కొడుకు..ఆయన అమ్మ నాన్న అన్నలతో కలిసి జీవిస్తాడు.

ఇక అనుకొని కారణాల వల్ల పై పటేల్ జూ లో ఉన్న జంతువులతో కలిసి కెనడా వెళ్తాడు.. ఇక పసిఫిక్ సముద్ర మార్గంలో వీళ్లు వెళ్తున్న క్రమంలో ఒక తుఫాన్ అయితే వస్తుంది. దాని ద్వారా అక్కడ ఎదురైన సంఘటనలు ఏంటి? దాని నుంచి తప్పించుకొని పటేల్ ఎలా తన గమ్యాన్ని రీచ్ అయ్యాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. నిజానికి ఈ సినిమా మొత్తాన్ని ఒక స్విమ్మింగ్ పూల్ లో తెరకెక్కించడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ లో పై పటేల్ ఒక క్లాసికల్ డాన్స్ చేస్తున్న అమ్మాయిని చూసి ఇష్టపడతాడు.

ఇక ఆమెను చూసిన ప్రతి ఒక్కరు ఆమె ఆక్టింగ్ కి ఫిదా అయిపోతారు. నిజానికి ఆ అమ్మాయి పేరు స్రవంతి సాయినాథ్. ప్రస్తుతం ఆ అమ్మాయి ఎంతలా మారిపోయింది అంటే ఎవరు కూడా ఆమెను గుర్తు పట్టలేనంతగా చేంజ్ అయింది. ఇక ప్రస్తుతానికి ఆమె సినిమాలు ఏమీ చేయనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది… ఇక ఆ అమ్మడు ఫోటోలు ఎలా ఉన్నాయి అనేది మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి…