https://oktelugu.com/

The Goat Movie : ఫ్లాప్ టాక్ తో ఇవేమి వసూళ్లు సామీ..4 రోజుల్లో విజయ్ ‘ది గోట్’ మూవీ ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా!

తమిళనాడు, ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ని ఈ చిత్రం రాబడుతుంది. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ లో ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 270 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ఇక హిందీ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 / 07:03 PM IST

    Vijay

    Follow us on

    The Goat Movie :  ఒకప్పుడు తమిళనాడు లో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు మినహా మరో హీరో పేరు వినపడేది కాదు, ఆ స్థాయి డామినేషన్ తో ఆయన బాక్స్ ఆఫీస్ ని రూలింగ్ చేసాడు. ఇలాంటి రేంజ్ ని భవిష్యత్తులో ఏ హీరోకి చూడలేము అని అనుకున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ ఇప్పుడు తలపతి విజయ్ మేనియా చూస్తుంటే వింటేజ్ రజినీకాంత్ రేంజ్ ని తలపిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అప్పట్లో రజినీకాంత్ ఫ్లాప్ సినిమాలు కూడా తన తోటి స్టార్ హీరోల సూపర్ హిట్ మూవీ కలెక్షన్స్ రేంజ్ లో వసూళ్లను రాబట్టేవి. ఇప్పుడు విజయ్ సినిమాలు కూడా అలా ఆడుతున్నాయి. ఆయన గత చిత్రం లియో ఫ్లాప్ టాక్ తో 650 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఇప్పుడు విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రం కూడా అదే విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది.

    ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు దాదాపుగా 128 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. టాలీవుడ్ మరియు మాలీవుడ్ లో ఈ సినిమాకి డిజాస్టర్ వసూళ్లు వస్తున్నాయి కానీ, తమిళనాడు, ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ని ఈ చిత్రం రాబడుతుంది. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ లో ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 270 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ఇక హిందీ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి. వీకెండ్ మొత్తానికి కలిపి 10 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. ఓవర్సీస్ లో కేవలం నార్త్ అమెరికా నుండే ఈ సినిమాకి 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. చాలా మంది తమిళ హీరోలకు ఈ సూపర్ హిట్ టాక్ వచ్చినా కూడా ఈ స్థాయి వసూళ్లు రావడం కష్టమే, ఒక రజినీకాంత్ కి తప్ప. కానీ విజయ్ ఒక ఫ్లాప్ సినిమాకి ఈ స్థాయి విద్వంసం సృష్టించడంతో ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు విజయ్ నటించిన సినిమాలలో ‘గోట్’ తో కలుపుకొని 8 చిత్రాలు 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి అట. ఇండియా లోనే ఇది ఆల్ టైం రికార్డు గా చెప్తున్నారు అభిమానులు. ఇక ఆ తర్వాతి స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ 6 సినిమాలు, సూపర్ స్టార్ రజినీకాంత్ 6 సినిమాలతో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ఇంతటి సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న విజయ్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లబోతున్నాడు. ఆయన రాజకీయాల్లోకి వెళ్తే తమిళనాడు థియేటర్స్ పరిస్థితి ఏమిటో అని బయ్యర్స్ భయపడుతున్నారు.