Retaining wall : ఇటీవల వర్షాలు కురిసిన సమయంలో విజయవాడలోని కృష్ణలంక, ఇతర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తలేదు. దీనికి ప్రధాన కారణం కృష్ణ నది వెంట నిర్మించిన రిటైనింగ్ వాల్. ఇది మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణ ఘనత మాదంటే మాదని అటు టిడిపి, ఇటు వైసిపి చెప్పుకున్నాయి. అయితే ఈ గోడను నిర్మించింది మల్లికార్జున్ అనే కాంట్రాక్టర్. ఈ గోడ నిర్మాణానికి మొత్తం 250 కోట్లు ఖర్చయింది. అయితే ఆ వాల్ నిర్మించిన కాంట్రాక్టర్ కు ప్రభుత్వం ఇంతవరకు చెల్లింపులు చేపట్టలేదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కాంట్రాక్టు బిల్లు చెల్లించాలని పలుమార్లు కోరాడు. జగన్కు అత్యంత దగ్గరగా ఉండే ధనంజయ రెడ్డిని సంప్రదించాడు. ధనుంజయ రెడ్డి ఆ బిల్లు క్లియర్ చేయాలని జగన్మోహన్ రెడ్డిని కోరగా..” మనమే అధికారంలోకి వస్తాం. ప్రమాణ శ్రీకరం తర్వాత ఆ బిల్లు క్లియర్ చేస్తామని” అన్నారు.. ఇదే విషయాన్ని ధనుజ రెడ్డి మల్లికార్జున్ కు చెప్పారు. దీంతో ఆయన మరో మార్గం ద్వారా జగన్మోహన్ రెడ్డిని నేరుగా కలిశారు..” రిటైనింగ్ వాల్ నిర్మించాను. దీనికి 250 కోట్ల దాకా ఖర్చయింది. వడ్డీల భారం పెరిగిపోతుంది. త్వరగా నా బిల్లు ఇప్పించే మార్గం చూడండి అంటూ” మల్లికార్జున్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. ” వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకటి లేదా రెండు నెలల్లో మీ బిల్లు క్లియర్ అవుతుందని” జగన్ హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మల్లికార్జున్ కు ఇబ్బందిగా పరిణమించాయి.
వైసిపి ఓడిపోయిన తర్వాత..
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయారు. దీంతో మల్లికార్జున్ ఆవేదనలో కూరుకుపోయారు. భారీగా అప్పులు తెచ్చి ఆ వాల్ నిర్మించారు. తెచ్చిన అప్పుల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఏం చేయాలో ఆయనకు పాలు పోవడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పని కాబట్టి.. కూటమి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుందో, లేదో అనే సంశయం మల్లికార్జున్ లో ఉంది.. అప్పట్లో ఆ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసేందుకు మల్లికార్జున్ ప్రభుత్వ బ్యాంకుల వద్ద రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ రుణాలకు సంబంధించిన భారం ఆయన మీద పడింది. ప్రభుత్వం సకాలంలో ఆ డబ్బులు చెల్లిస్తేనే అతనికి ఉపశమనం లభిస్తుంది. మరి ఆ దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం కనుక బిల్లు క్లియర్ చేయకపోతే.. కృష్ణలంకవాసులు ఆ బకాయి నగదును ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా? ఒకవేళ ఇదే గనుక జరిగితే భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఘట్టంగా ఇది నిలిచిపోతుంది.