Mangalavaaram: పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ ను సంపాదించింది. ఈ ఒక్క సినిమాతోనే ఆమె ఇండస్ట్రీలో వాంటెడ్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. కానీ బోల్డ్ కంటెంట్ తో వచ్చిన పాయల్ రాజ్ పుత్ నెగిటివిటీ ఎక్కువ సంపాదించింది. దీంతో పెద్దగా ఆఫర్స్ రాలేకపోయాయి. కానీ రవితేజతో నటించడానికి ఛాన్స్ రావడంతో ఈమె దశ తిరుగుతుంది అనుకున్నారు. కానీ చిన్న సినిమాల్లో మాత్రమే అవకాశాలు పొందింది. అయితే ప్రస్తుతం మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆర్ ఎక్స్ 100 సినిమాకు దర్శకత్వం వహించిన అజయ్ భూపతి ఈ సినిమా కూడా దర్శకత్వం వహించారు. మరోసారి తన లక్ ను పరీక్షించుకునే అవకాశం పాయల్ కే ఇచ్చారు. అయితే ఈ హీరోయిన్ కంటే ముందు మరో హీరోయిన్ తో మంగళవారం సినిమాలో నటించేందుకు అడిగినట్లు తెలుస్తోంది. కానీ ఆ హీరోయిన్ ఈ సినిమా కంటెంట్ బోల్డ్ నెస్ ఎక్కువ ఉందని ఆమె తిరస్కరించింది. అయితే ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? మంగళవారం సినిమా విడుదలకు ముందే భారీ హైప్ ని క్రియేట్ చేసింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో మంది అభిమానులు ఎదురుచూశారు.
అందరి అంచనాలను బద్దలు చేస్తూ మరింత సూపర్ సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది మంగళవారం సినిమా. ఇలాంటి సినిమాను శ్రద్దదాస్ ను తీసుకోవాలి అనుకున్నారట. కానీ ఈ అమ్మడు సినిమా ఆఫర్ ను రిజక్ట్ చేసింది. ఈమె సిద్దూ ప్రమ్ శ్రీకాకుళం, ఆర్య-2 వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ అమ్మడు బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని సినిమాను మిస్ చేసుకుంది. అయితే ఇదే సినిమా ఇప్పుడు ఫుల్ కలెక్షన్లతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో శ్రద్దా అభిమానులు బాధ పడుతున్నారు.
ఇక పాయల్ రాజ్ పుత్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా కూడా మంగళవారం సినిమా కంటెంట్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా షూటింగ్ అయిన తర్వాత వెంటనే చికిత్స చేయించుకోవాలని ఫిక్స్ అయిందంట. మొత్తం మీద కష్టపడి మరో హిట్ ను సొంతం చేసుకుంది పాయల్.