Ram Charan: చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా, తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక నుండి విడుదల అవ్వబోయే రామ్ చరణ్ సినిమాలు కేవలం తెలుగు సినిమాలు కావు. పాన్ వరల్డ్ సినిమాలు అనే అనాలి. #RRR చిత్రం తర్వాత ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేసాడు. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్త చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లో మన ముందుకు రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన క్యాలిఫోర్నియా లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ కి ఒక అతిథిగా హాజరయ్యాడు.
ఆ తర్వాత ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. యాంకర్ ఇంస్టాగ్రామ్ లో రామ్ చరణ్ అప్లోడ్ చేసే ఫోటోల క్రింద అభిమానులు పెట్టే హైలైట్ కామెంట్స్ గురించి ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. అందులో ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో తాను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న ‘రైమ్’ అనే కుక్క ని తన జాకెట్ లో పెట్టుకున్న ఫోటో ని చూపిస్తూ, యాంకర్ రైమ్ గురికించి పలు ప్రశ్నలు అడుగుతుంది. ఆమె మాట్లాడుతూ ‘మీకు రైమ్ తో మంచి అనుబంధం ఉన్నట్లుంది. ఎక్కడికి వెళ్లినా రైమ్ ని తీసుకెళ్తున్నారు. మీరు విమానాశ్రయం లోకి వచ్చినప్పుడు కూడా రైమ్ మీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చిన వీడియోలను చాలా చూసాము..మీకు ఉన్న ఈ బిజీ షెడ్యూల్ లో రైమ్ కి, క్లిన్ కారా కి సమయం ఎలా కేటాయిస్తున్నారు?’ అని అడగగా, దానికి రామ్ చరణ్ సమాధానం చెప్తూ ‘మేమంతా ఒకే బెడ్ మీద పడుకుంటాము. షూటింగ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత సమయం మొత్తం వీటికే కేటాయిస్తాను’ అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.
యాంకర్ రామ్ చరణ్ ని మరో ప్రశ్న అడుగుతూ ‘మీరు క్యూట్ గా ఉంటారా?, లేదా రైమ్ క్యూట్ గా ఉంటుందా’ అని అడగగా, దానికి ఆయన సమాధానం చెప్తూ ‘నాకంటే రైమ్ చాలా క్యూట్ గా ఉంటుంది'[ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల విషయానికి వస్తే ‘గేమ్ చేంజర్ ‘ షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకొని డిసెంబర్ లో విడుదలకు సిద్ధం గా ఉంది. కానీ శంకర్ కి రామ్ చరణ్ ఉన్న కొన్ని సన్నివేశాలను మరోసారి రీ షూటింగ్ చేస్తే బాగుంటుంది అని అనిపించిందట. రామ్ చరణ్ ని కొన్ని డేట్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ కూడా చేసాడట, మరి రామ్ చరణ్ ఇస్తాడో లేదో చూడాలి.