Homeఎంటర్టైన్మెంట్Ram Charan: రామ్ చరణ్ బుచ్చిబాబు తో చేస్తున్న సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో...

Ram Charan: రామ్ చరణ్ బుచ్చిబాబు తో చేస్తున్న సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

తెలుగులో రామ్ చరణ్ లాంటి హీరో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన పాన్ ఇండియాలో గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. కాబట్టి ఆయనకు మార్కెట్ కూడా విపరీతంగా ఉందనే చెప్పాలి. సరైన సినిమా పడితే ఆయన దాదాపు 2000 కోట్ల వరకు వసూళ్లను రాబట్టగలిగే కెపాసిటీ ఉన్న హీరో కావడం విశేషం...

Ram Charan: ప్రస్తుతం తెలుగు సినిమా హీరోల మార్కెట్ భారీగా పెరిగింది. పాన్ ఇండియా సినిమాలను చేస్తూనే అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. తద్వారా వాళ్ళ మార్కెట్ పెరగడమే కాకుండా రెమ్యూనరేషన్స్ కూడా భారీగా పెంచుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి కొంతమంది హీరోలైతే ప్రాఫిట్స్ లో పర్సంటేజ్ ని కూడా తీసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన చాలా ఈజీగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ వందల కోట్ల కలెక్షన్లు రాబట్టడంలో ముందు వరుసలో ఉన్నాడు… ఇక ఏది ఏమైనప్పటికి సినిమా ఇండస్ట్రీలోని హీరోలు అంచలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు పాన్ ఇండియాలో స్టార్లుగా వెలుగొందడం అనేది నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క అభిమాని గర్వపడాల్సిన విషయమనే చెప్పాలి. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరే మొదటగా వినిపిస్తోంది.

అలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేసిన మన దర్శకులకు, హీరోలకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేము… ఇక ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ గా తన స్టార్ డమ్ ను విస్తరించుకుంటూ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న హీరో రామ్ చరణ్…

ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఒక కొత్త జానర్ లో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు రామ్ చరణ్ ఎప్పుడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అసలు సినిమానే చేయలేదు. కాబట్టి ఈ సినిమాతో ఆయన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాని కూడా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక అందులో భాగంగానే రామ్ చరణ్ ఇప్పుడు ఈ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ సినిమా దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక రామ్ చరణ్ ఈ సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. దీంతో రామ్ చరణ్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయన మార్కెట్ పెరగడమే కాకుండా రెమ్యూనరేషన్ ని కూడా మరింత భారీగా పెంచే అవకాశాలైతే ఉన్నాయి..

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper