https://oktelugu.com/

AR Rahman: రామ్ చరణ్ సినిమా కోసం రెహమాన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

రామ్ చరణ్ ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 7, 2024 / 09:36 AM IST

    AR Rahman

    Follow us on

    AR Rahman: పాన్ ఇండియా హీరో గా మంచి గుర్తింపు పొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వైవిధ్యమైన కథంశాలను ఎంచుకుంటూ తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ఇప్పుడు ఆయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీదనే ప్రస్తుతం ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా రోజురోజుకు లేటవుతుంది.

    అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రామ్ చరణ్ ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక అందులో భాగంగానే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా సమ్మర్ నుంచి జరుపనున్నట్టుగా చిత్ర యూనిట్ తెలియజేసింది. అయితే ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూసర్లు గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఏ ఆర్ రెహమాన్ వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా కావడం వల్ల దీనికి మ్యూజిక్ కొంచెం ఫ్రెష్ గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యం తోనే బుచ్చిబాబు రెహమాన్ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇంతకు ముందు బుచ్చిబాబు తీసిన ఉప్పెన సినిమాకి దేవిశ్రీప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు అతన్ని కాదని ఏఆర్ రెహమాన్ ను తీసుకోవడం వల్ల కొంతమంది బుచ్చిబాబు మీద నెగిటివ్ గా స్పందిస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమాకి రెహమాన్ మ్యూజిక్ అయితే బాగుంటుందని బుచ్చిబాబు అనుకున్నాడు కాబట్టి అతన్ని తీసుకున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే రెహమాన్ ఈ సినిమా కోసం 3 కోట్ల రేమ్యున్ రేషన్ ని కూడా తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ సినిమాకి మొదటిసారి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు

    రెహమాన్ ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడు అనేదే ఇప్పుడు అందరిలో చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అయితే బుచ్చిబాబు ఈ సినిమాని స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు కాబట్టి రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ఇందులో ప్రతి సీను, ప్రతి షాట్ కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఆయన అలా కొత్తగా సినిమా చేస్తాడనే ఒకే ఒక ఉద్దేశ్యంతో రామ్ చరణ్ ఈ సినిమాకి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరి బుచ్చిబాబు, రామ్ చరణ్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడు అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…