Devara Glimpse: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రెండు పార్టులు గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…ఇక ఈ సినిమా గ్లింప్స్ ని 8 వ తేదీన రిలీజ్ చేస్తాం అని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గ్లింప్స్ కి సంబంధించిన ఒక షాట్ ని రిలీజ్ చేశారు. అయితే ఆ షాట్ లో వాటర్ మొత్తం రక్తంతో నిండిపోయింది.ఇక అది చూసిన ప్రతి ప్రేక్షకుడికి కూడా అది గూజ్ బమ్స్ మూమెంట్ అనే చెప్పాలి. ఎన్టీయార్ అభిమానులకైతే రక్తం మరిగే షాట్ అనే చెప్పాలి. ఇది చూస్తుంటే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ని భారీ రేంజ్ లో తెరకెక్కించిన గా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా ఈ గ్లింప్స్ తో ఆ అంచనాలు తారస్థాయికి చేరాయనే చెప్పాలి. ఇక 8 వ తేదీన ఫుల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాని డైరెక్టర్ కొరటాల శివ చాలా కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ప్రతి చిన్న విషయాన్ని కూడా తనే దగ్గరుండి మరి చూసుకుంటూ ఈ సినిమాని సక్సెస్ చేయాలని చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నట్టు గా తెలుస్తుంది. అయితే కొరటాల శివ ఇంతకు ముందు చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా ఫ్లాప్ అవడంతో ఈ సినిమా తో భారీ సక్సెస్ ను కొట్టి పాన్ ఇండియా రేంజ్ లో తన పేరు మారు మ్రోగేలా చేయాలని చూస్తున్నాడు.
అయితే కొరటాల శివ ఇంతకు ముందు ఎన్టీయార్ తో చేసిన జనతా గ్యారేజ్ సినిమా మంచి హిట్ అవ్వడం తో వీళ్ళ కాంబో మీద జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తాడా లేదా అనే విషయం తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…
Unleashing fear in 2 days
Man of Masses #NTR’s #DevaraGlimpse will deliver a massive feast on Jan 8th at 4:05 PM #Devara@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @anirudhofficial@NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @Yugandhart_… pic.twitter.com/cICvJgTjFx
— Devara (@DevaraMovie) January 6, 2024