Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మరో ఆరు రోజుల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో కనీవినీ ఎరుగని రీతిలో భారీగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. నిన్న విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి అటు అభిమానుల నుండి ఇటు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ శంకర్ నుండి ఎలాంటి సినిమాని అయితే కోరుకుంటామో, అలాంటి సినిమాని అందించబోతున్నాడని ఈ ట్రైలర్ ని చూసినప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన అన్ని పాటల్లో ‘జరగండి..జరగండి’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో ఈ పాటకు సుమారుగా 50 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ పాట లోని విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఈ పాటకు ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. పాట ఇంత రీచ్ గా తీశారు కదా, కొరియోగ్రఫీ చేసినందుకు ఆయన రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లోనే తీసుకొని ఉంటాడని అందరూ అనుకున్నారు. అయితే రీసెంట్ గానే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ శంకర్ అసలు నిజం బయటపెట్టాడు. ఈ పాటకి కొరియోగ్రఫీ చేసినందుకు ప్రభుదేవా ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదట. నాకు మీరంటే ఎంత గౌరవం ఉందో, రామ్ చరణ్ గారంటే కూడా అంతే గౌరవం ఉంది, అందుకే నేను ఈ పాటకు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు, వాళ్ళ కోసం నా చిన్న బహుమతిగా ఈ పాటని చేస్తున్నాను, సినిమాలో ప్రత్యేక కృతఙ్ఞతలు అని చెప్పి నాకు ఒక్క టైటిల్ కార్డు వెయ్యండి చాలు అని అన్నాడంటూ డైరెక్టర్ శంకర్ చెప్పుకొచ్చాడు.
ప్రభుదేవా లాంటి బిజీ కొరియోగ్రాఫర్ ఒక సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోకుండా పని చేయడం అనేది చిన్న విషయం కాదు. ఆయన ఒక్క రోజు కాల్ షీట్ విలువ కోటి రూపాయిల వరకు ఉంటుంది. అలాంటి రేంజ్ ఉన్న డైరెక్టర్ రామ్ చరణ్ కోసం ఉచితంగా చేశాడంటే, ఎంత అభిమానం ఉంటే అలా చేసిన ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఈ పాట సినిమాకి పెద్ద హైలైట్ గా నిలుస్తుందని డైరెక్టర్ శంకర్ చెప్పుకొచ్చాడు. ఈ పాట కోసం వేసిన సెట్ ఖర్చులే 20 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. రామ్ చరణ్ వేసిన స్టెప్పులు ఇది వరకు వేసిన స్టెప్పులు లాగా కాకుండా చాలా బిన్నంగా ఉంటుందట. థియేటర్స్ కి కేవలం ఈ పాట ని చూసేందుకు కోసం రిపీట్స్ లో ఆడియన్స్ వస్తారని, తన కెరీర్ లోనే ది బెస్ట్ విజువల్ సాంగ్ అంటూ డైరెక్టర్ శంకర్ చెప్పుకొచ్చాడు. మరి ఆయన చెప్పిన రేంజ్ లో పాట ఉంటుందా లేదా అనేది చూడాలి.