https://oktelugu.com/

Renu Desai : ‘నా దృష్టిలో ‘ఓజీ’ అంటే కేవలం అతను మాత్రమే’ అంటూ రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్!

సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచే స్త్రీలలో ఒకరు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.

Written By:
  • Vicky
  • , Updated On : January 4, 2025 / 08:13 AM IST

    Renu Desai

    Follow us on

    Renu Desai : సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచే స్త్రీలలో ఒకరు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. ఈమె ప్రతీ చిన్న విషయానికి స్పందించే గుణం ఉన్నటువంటి సున్నితమైన మనిషి. తన మనసుకి ఏది అనిపిస్తే అది నిర్మొహమాటంగా మాట్లాడడం ఈమె స్టైల్. అలా మాట్లాడడం వల్ల ఈమె పలుసార్లు ట్రోల్ల్స్ కి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే విపరీతమైన నెగటివిటీ ఉండే ట్విట్టర్ లో ఈమె తన అకౌంట్ ని తొలగించుకుంది. ఇంస్టాగ్రామ్ లో కూడా నెగటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నందున ఆమె కామెంట్స్ ని ఆఫ్ లో పెట్టుకుంది. అయితే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఎప్పుడూ చాలా ఆదర్శవంతమైన క్వాట్స్ ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది రేణు దేశాయ్. అయితే సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే రేణు దేశాయ్, రాజకీయాలకు మాత్రం దూరం గా ఉంటూ వచ్చింది.

    అయితే నిన్న ఆమె భారత చైత్యన్య యువజన పార్టీ నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమం లో పాల్గొని అద్భుతమైన ప్రసంగం అందించింది. సావిత్రి బాయి పూలే 194 వ జయంతి ని పురస్కరించుకొని ఈ దినోత్సవం ని జరుపుకుంటారు. ఈ ఈవెంట్ కి రేణు దేశాయ్ తో పాటు, కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ముందుగా ఆమె బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ ‘బ్రహ్మానందం గారి లాంటి లెజెండ్స్ ఉన్నటువంటి ఈ వేదిక ని నేను పంచుకోవడాన్ని ఎంతో అదృష్టం గా భావిస్తున్నాను. నా దృష్టిలో ఆయనే నిజమైన ఓజీ. ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ అంటూ పొగడతలతో ముంచెత్తింది. అనంతరం ఆమె సావిత్రి బాయి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ తరంలో చాలా మందికి సావిత్రి బాయి అంటే ఎవరో తెలియదు.

    ఆమె గొప్పతనం గురించి వివరిస్తూ రేణు దేశాయ్ మాట్లాడిన మాటలకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆమె మాట్లాడుతూ ‘ మహిళల విద్య కోసం సావిత్రి బాయి చేసి కృషి సాధారణమైనది కాదు, అలాంటి మహానుభావురాలి జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలిసిందే నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. కానీ సావిత్రి బాయి పూలే గారి జయంతి వేడుకల్లో పాల్గొనాలని రామ చంద్ర యాదవ్ గారు ఆహ్వానించిన వెంటనే ఇక్కడికి వచ్చేసాను. పిల్లలు మా దగ్గర కంటే ఎక్కువగా ఉపాధ్యాయుల దగ్గరే గడుపుతారు. కాబట్టి వాళ్ళని సరైన మార్గం లో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులదే’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్, పూణే మధ్యనే వస్తూ పొత్తు ఉండేది కానీ, మొట్టమొదటిసారి ఆమె విజయవాడలో అడుగుపెట్టింది. ఇదే విజయవాడ లో పవన్ కళ్యాణ్ కూడా ఉంటున్న సంగతి తెలిసిందే.