https://oktelugu.com/

Game Changer : ‘గేమ్ చేంజర్’ లో అప్పన్న క్యారక్టర్ కి ఆ రోగం ఉందా..? రామ్ చరణ్ తో ఇలాంటి ప్రయోగం చేయడం మామూలు విషయం కాదు!

నేటి తరం హీరోలలో ఛాలెంజింగ్ రోల్స్ చేయాలంటే మన అందరికి గుర్తుకు వచ్చే రెండు మూడు పేర్లలో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. దర్శకులు రామ్ చరణ్ ని ఎలాంటి పాత్ర కోసం అయినా ఉపయోగించుకోవచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : January 4, 2025 / 08:04 AM IST

    Game Changer

    Follow us on

    Game Changer : నేటి తరం హీరోలలో ఛాలెంజింగ్ రోల్స్ చేయాలంటే మన అందరికి గుర్తుకు వచ్చే రెండు మూడు పేర్లలో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. దర్శకులు రామ్ చరణ్ ని ఎలాంటి పాత్ర కోసం అయినా ఉపయోగించుకోవచ్చు. అంత అద్భుతంగా ఆయన నటిస్తాడు. అందుకు ఉదాహరణ ‘రంగస్థలం’ చిత్రం లో ఆయన పోషించిన చిట్టి బాబు పాత్ర. ఈ పాత్రకు సినిమాలో ఒక చెవి పని చేయదు. చవిటి వాడిలాగా రామ్ చరణ్ మొదటి ఫ్రేమ్ నుండి చివరి వరకు ఎంతో అద్భుతంగా నటించాడు. ఆయనకు కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నారు కానీ, కొన్ని రాజకీయాల కారణంగా ఆ అవార్డు రామ్ చరణ్ కి మిస్ అయ్యింది. అయితే ఆ మిస్ అయిన నేషనల్ అవార్డు, కచ్చితంగా ‘గేమ్ చేంజర్’ చిత్రానికి లభిస్తుందని. ఫ్లాష్ బ్యాక్ లో ఆయన పోషించిన అప్పన్న క్యారక్టర్ ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తుందని మేకర్స్ ఇది వరకే చెప్పుకొచ్చారు.

    ఆపన్న క్యారక్టర్ లో మరో ట్విస్ట్ కూడా ఉందట. ఈ పాత్రకి నత్తి ఉంటుందట. నత్తి కారణంగా అప్పన్న కి జీవితం లో ఎన్నో సవాళ్లు ఎదురు అవుతాయి. చివరికి ఒక పెద్ద అనర్దానికి దారి తీయడానికి కారణం కూడా ఆ నత్తియే అని ఈ చిత్రాన్ని ప్రైవేట్ స్క్రీనింగ్ లో చూసిన కొంతమంది మీడియా ప్రతినిధులు చెప్తున్నారు. రామ్ చరణ్ ఈ క్యారక్టర్ లో జీవించేసాడని, విడుదల తర్వాత ‘రంగస్థలం’ లోని చిట్టి బాబు క్యారక్టర్ ని కూడా డామినేట్ చేస్తుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు. చిట్టి బాబు క్యారక్టర్ ని డామినేట్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. నటన పరంగా ఎవరెస్ట్ రేంజ్ ని చూపించిన క్యారక్టర్ అది. అలాంటి పాత్ర ని మించిన పాత్ర అంటే శంకర్ రామ్ చరణ్ ని ఏ రేంజ్ లో వాడేసాడో అర్థం చేసుకోవచ్చు.

    ఈ చిత్రం లో అప్పన్న క్యారక్టర్ తర్వాత మనమంతా థియేటర్ నుండి బయటకి వచ్చిన తర్వాత అంజలి క్యారక్టర్ గురించి కూడా మాట్లాడుకుంటాం అట. ఆ రేంజ్ లో ఆమె కూడా నటించిందని టాక్. ఇద్దరికీ నేషనల్ అవార్డు వస్తుందని అంటున్నారు. ఇక ట్రైలర్ ని చూసిన తర్వాత రామ్ చరణ్ ని మాస్ యాంగిల్ లో, ఎమోషనల్ యాంగిల్, కామెడీ యాంగిల్ ఇలా అన్ని యాంగిల్స్ లో చూపించి అభిమానులకు కనుక పండుగ లాగా ఉండబోతుంది అనే హింట్ ఇచ్చాడు. మరి ఆ రేంజ్ సినిమా కూడా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మరో ఆరు రోజులు ఆగాల్సిందే. ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రాజమండ్రి లో గ్రాండ్ గా జరపబోతున్నారు. ఈ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.