Nagarjuna Geethanjali Movie Collections: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీస్ లిస్ట్ తీస్తే అందులో ‘గీతాంజలి'(Geethanjali Movie) గురించి మాట్లాడుకోకుండా అసలు ఉండలేము. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), మణిరత్నం(Maniratnam) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఆరోజుల్లో ఒక ప్రభంజనం. క్యాన్సర్ వ్యాధితో చావుకి అతి దగ్గరగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అనే విభిన్నమైన ఆలోచనతో ఈ చిత్రాన్ని మణిరత్నం ఒక అందమైన పెయింటింగ్ లాగా తీర్చి దిద్దాడు. ఇప్పుడు చూసినా కూడా ఈ సినిమా చాలా కొత్తగా, ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగిస్తుంది. అలాంటి మ్యాజిక్ కి ఈ చిత్రం తో క్రియేట్ చేశాడు డైరెక్టర్ మణిరత్నం. ఇక ఈ సినిమా ముందు వరకు కూడా నాగార్జున ని కేవలం అక్కినేని నాగేశ్వర రావు కుమారుడిగా మాత్రమే చూస్తూ వచ్చారు ప్రేక్షకులు. కానీ ఈ చిత్రం తర్వాత నాగార్జున లోని అద్భుతమైన నటుడు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
ఈ సినిమా నుండే నాగార్జున తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాడు. ఈ సినిమా కేవలం తెలుగు లో మాత్రమే కాదు, తమిళం లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ముందుగా తెలుగు లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత తమిళం లోకి డబ్ చేసి విడుదల చేశారు. అక్కడ కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఆరోజుల్లోనే ఈ చిత్రం తమిళనాడు ప్రాంతం లో 4 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది. అప్పటి నుండే నాగార్జున కి తమిళం లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా తమిళం లోనే తెరకెక్కించాలని మణిరత్నం అనుకున్నాడట.
Also Read: ‘కూలీ’,’వార్ 2′ చిత్రాలు ఎన్టీఆర్, నాగార్జునలకు అసలు ఉపయోగపడ్డాయా..?
అప్పుడు నాగార్జున ‘మీకు ఎలాగో తమిళం లో పెద్ద మార్కెట్ ఉంది. తెలుగు లో లేదు కదా, తెలుగు లోనే చెయ్యండి, మీకు ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడుతుంది’ అంటూ మణిరత్నం కి చెప్పాడట. ఆయన కూడా మాట విని ఈ సినిమాని తెరకెక్కించాడు. ఫలితం ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో నాగార్జున తన ‘శివ’ చిత్రాన్ని కూడా తమిళం లో విడుదల చేశాడు. ఇది గీతాంజలి కంటే పెద్ద హిట్ అయ్యింది. నాగార్జున కి తమిళ నాడు లో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ కారణంగా అప్పటి తమిళ దర్శక నిర్మాతలు నాగార్జున ఇంటి వైపు క్యూ కట్టేవారు. అలా ఆయనతో తమిళం లో నేరుగా ‘రక్షకుడు’ అనే చిత్రం చేశాడు. ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. కానీ నాగార్జున కి మాత్రం అక్కడి లోకల్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది, ఇప్పుడు కూలీ చిత్రం లో ఆయన పోషించిన సైమన్ క్యారక్టర్ ని అక్కడి ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.