Lokesh Kanagaraj Khaidi 2: లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) బ్రాండ్ ఇమేజ్ సినిమా సినిమాకు పడిపోతుంది. ‘నగరం’ అనే చిత్రం తో దర్శకుడిగా మారిన ఆయన, ఆ తర్వాత తమిళ హీరో కార్తీ తో చేసిన ‘ఖైదీ’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. తెలుగు లో కూడా ఆయన పేరు ఈ చిత్రం తో మారుమోగిపోయింది. ఈ చిత్రం తర్వాత ఆయన విజయ్ తో చేసిన మాస్టర్ చిత్రం సూపర్ హిట్ అవ్వగా, ఆ సినిమా తర్వాత ఆయన తన అభిమాన హీరో కమల్ హాసన్ తో చేసిన ‘విక్రమ్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సేన్సేన్షనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకింమ్చి చెప్పనవసరం లేదు. అప్పటి వరకు వరుస ఫ్లాప్స్ తో ఉన్న కమల్ హాసన్ ఈ చిత్రం తో ఏకంగా 400 కోట్ల రూపాయిలను కొల్లగొట్టి మళ్ళీ టాప్ లీగ్ లోకి అడుగుపెట్టాడు.
Also Read: నాగార్జున ‘గీతాంజలి’ తమిళంలో ఆ రోజుల్లోనే ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా?
విక్రమ్ సినిమా ని ఒక కేసు స్టడీ గా తీసుకోవచ్చు. ఫిల్మ్ స్కూల్స్ లో దర్శకత్వం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్లకు ఈ చిత్రాన్ని చూపించవచ్చు. అంత అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత ఆయన గ్రాఫ్ పడిపోవడం మొదలైంది . విక్రమ్ తర్వాత విజయ్ తో చేసిన ‘లియో’ చిత్రానికి అప్పట్లో నెగిటివ్ రివ్యూస్ బాగా వచ్చాయి. సెకండ్ హాఫ్ పై క్రిటిక్స్ తీవ్రమైన రివ్యూస్ ఇచ్చారు . ఇక రీసెంట్ గా విడుదలైన ‘కూలీ'(Coolie Movie) చిత్రం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు అసలు దీనికి దర్శకత్వం వహించింది లోకేష్ కనకరాజ్ యేనా?, ఇలా తీశాడేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉన్నా మంచి క్రేజ్ తో విడుదలైంది కాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. 5 రోజుల్లో దాదాపుగా 430 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇదంతా పక్కన పెడితే లోకేష్ కనకరాజ్ తన తదుపరి చిత్రం ‘ఖైదీ 2’ అని ‘కూలీ’ మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ లో తెలిపాడు. ఈ ఏడాది చివరి నుండి షూటింగ్ మొదలు అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇంతలోపే మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లైన్ లోకి తీసుకొచ్చాడు. కోలీవుడ్ టాప్ 2 హీరోలుగా దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న రజినీకాంత్(Superstar Rajinikanth), కమల్ హాసన్(Kamal Haasan) మల్టీస్టార్రర్ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ‘ఖైదీ 2’ కంటే ముందుగా ఈ చిత్రమే మొదలు అవుతుందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి సినిమాలు చేసి నాలుగు దశాబ్దాలు అయ్యింది. ఆరోజుల్లో కమల్ హాసన్ హీరో గా నటిస్తే రజినీకాంత్ విలన్ గా నటించాడు. మరి లోకేష్ కనకరాజ్ తీస్తున్న ఈ మల్టీస్టార్రర్ లో ఎవరిని హీరో గా చూపించబోతున్నాడో, ఎవరిని విలన్ గా చూపించబోతున్నాడో చూడాలి.