Keerthy Suresh: హీరోయిన్ మేనక, దర్శకుడు సురేష్ ల కుమార్తె కీర్తి సురేష్. 80-90లలో మేనక సౌత్ లో స్టార్ లేడీగా వందల చిత్రాల్లో నటించింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. చిన్నమ్మాయి కీర్తి సురేష్ బాల్యంలోనే సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. పలు మలయాళ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అనంతరం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కీర్తి సురేష్ చాలా చిత్రాల్లో నటించింది. నేను శైలజ ఆమె ఫస్ట్ టాలీవుడ్ మూవీ. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది.
పవన్ కళ్యాణ్ వంటి బడా స్టార్ తో జతకట్టింది. అజ్ఞాతవాసి మూవీలో కీర్తి సురేష్ ఒక హీరోయిన్. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కీర్తి సురేష్ కి బ్రేక్ ఇచ్చిన మూవీ మహానటి. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ ,మూవీ తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్. కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు దక్కింది. అనంతరం ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. మహేష్ కి జంటగా సర్కారు వారి పాట మూవీ చేసింది. ఇది కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. నానితో చేసిన దసరా మరో భారీ హిట్. స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూనే.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ హీరో చిరంజీవి సిస్టర్ రోల్ చేయడం విశేషం.
ప్రస్తుతం కీర్తి సురేష్ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె చేతి నిండా సినిమాలతో బిజీ. అయినప్పటికీ ఆమె పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. తన లాంగ్ టర్మ్ బాయ్ ఫ్రెండ్ ఆంటోని తట్టిల్ తో కీర్తి సురేష్ ఏడడుగులు వేయనుంది. డిసెంబర్ 12న గోవాలో ఘనంగా క్రిష్టియన్ సాంప్రదాయంలో వివాహం నిర్వహించనున్నారు. కీర్తి సురేష్ పెళ్లి పత్రిక ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కీర్తి సురేష్ వద్ద.. వాల్వో ఎస్ 90(60 లక్షలు), బీఎండబ్ల్యూ 7 సిరీస్(1.38 కోట్లు), మెర్సిడెజ్ ఏఎంజి జీల్సీ 43(81 లక్షలు) వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
గత 15 ఏళ్లుగా వీరు రిలేషన్ లో ఉన్నారట. కీర్తి సురేష్ పెళ్లి నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆసక్తికర సంగతులు తెరపైకి వస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం కీర్తి సురేష్ నెట్ వర్త్ రూ. 41 కోట్లు. ఆమె సినిమాకు రూ. 3-5 కోట్లు తీసుకుంటుంది. నెలకు రూ. 35 లక్షల ఆదాయం ఉంది. ప్రకటనలో నటిస్తే.. రూ. 30 లక్షలు, ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి రూ. 25 లక్షలు తీసుకుంటుందట. చెన్నైలో ఒక ఇల్లు ఉంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉందట.