Komatireddy Rajgopal Reddy : రాజగోపాల్ రెడ్డి నిష్క్రమణ బీజేపీకి కూడా ఓ గుణపాఠం

రాజగోపాల్ రెడ్డి నిష్క్రమణ బీజేపీకి కూడా ఓ గుణపాఠం అంటూ ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: Neelambaram, Updated On : October 26, 2023 4:40 pm

Komatireddy Rajgopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణలో వేల కోట్ల వ్యాపారం.. ఆస్తులు ఉన్నాయి. ఆయన ప్రథమ ధ్యేయం తన వ్యాపారాలను ప్రభుత్వాలకు అనుగుణంగా విస్తరించుకోవడం ప్రధాన టార్గెట్. అందులో భాగంగానే రాజకీయాలు చేస్తుంటాడు. రాజకీయాలు అయినా.. రాజకీయా పార్టీలు అయినా ఈ వ్యాపార విస్తరణకు సోపానాలుగా వాడుకోవడం.. దానికి ఒక థియరీని తయారు చేసుకుంటాడు. అదేదో పవిత్ర కార్యంలా.. జనం కోసం తాను ఉన్నానని.. జనంలో, మీడియాలో ఊదరగొడుతున్నాడు.

తెలంగాణ ఏర్పడింది నాయకుల కోసమా? జనం బాగోగుల కోసమా.. నాయకులు ఎటు వెళ్లిపోతే జనం కూడా అటే మారాలా? మునుగోడులో మీ కోసం రాష్ట్రం, దేశం మొత్తం మీద బిగ్గెస్ట్ లీడర్ అయిన అమిత్ షా సైతం వచ్చి మునుగోడులో ప్రచారం చేశాడు. మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన నాయకులు, కార్యకర్తలను పక్కనపెట్టి జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. ఎంతో కీలకమైన అభ్యర్థులను ఎంపిక చేసే స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ గా కోమటిరెడ్డిని బీజేపీ చేసింది. కోరిందే తడువుగా అమిత్ షా ఏది అడిగినా కోమటిరెడ్డికి ఇచ్చాడు. ఒక్కరోజులో కోమటిరెడ్డికి బీజేపీ కానిది అయిపోయింది.. కాంగ్రెస్ ఏమో అయినది అయిపోయింది. ఎంత మార్పు.. కోమటిరెడ్డి నిన్నటిదాకా కాంగ్రెస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయడం లేదని ఇదే కోమటిరెడ్డి అంటున్నాడు.

రాజగోపాల్ రెడ్డి నిష్క్రమణ బీజేపీకి కూడా ఓ గుణపాఠం అంటూ ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.