Suman Shetty And Director Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కమెడియన్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకొని తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే సుమన్ శెట్టి లాంటి నటుడు సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఇక తేజ చేసిన జయం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆయనకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ అయితే లభిస్తోంది. మరి ఇలాంటి క్రమంలోనే గతంలో సుమన్ శెట్టి చేసిన ఒక గొప్ప పని గురించి డైరెక్టర్ తేజ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి…
అవేంటి అంటే ‘జయం ‘ సినిమా సక్సెస్ అయిన తర్వాత సుమన్ శెట్టి తేజ దగ్గరికి వచ్చినపుడు తేజ సినిమా ఇండస్ట్రీలో కెరియర్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. కాబట్టి ముందుగా నువ్వు ఒక ల్యాండ్ తీసుకొని ఒక ఇల్లు అయితే కట్టుకొమని చెప్పాడట… అలాగే తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి తేజ కి కృతజ్ఞతలు చెబుతూ సుమన్ శెట్టి ఆయన కాళ్ళ మీద పడబోతుంటే తేజ వద్దని చెప్పి నీకు అంతగా కృతజ్ఞత తీర్చుకోవాలని ఉంటే నువ్వు కట్టుకుంటున్న ఇంట్లో నాకోసం ఒక రూమ్ అయితే కట్టు నేను ఎప్పుడు కొత్త వాళ్ళతో సినిమాలు చేస్తూ ఉంటాను.
కాబట్టి ఒకవేళ నా పొజిషన్ బ్యాడ్ అయ్యి నేను రోడ్డు మీదకు వచ్చినప్పుడు కనీసం నేను వచ్చి ఉండడానికైనా ఆ రూమ్ ఉంటుందని చెప్పాడట. దాంతో సుమన్ శెట్టి సపరేట్ గా తేజ గారి కోసం ఒక రూమ్ కట్టి దానికి తేజ ఫోటో పెట్టారట. ఇక ప్రతిరోజు ఆ రూమ్ ని క్లీన్ చేస్తూ ఉంటారని తేజ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…
ఇక ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. దాంతో ఇప్పుడు చాలామంది సుమన్ శెట్టి మంచితనం గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ 9 సీజన్లో కంటెస్టెంట్ గా ఉన్నాడు. కాబట్టి అతన్ని అభిమానించే వాళ్ళందరూ ఈ న్యూస్ తెలుసుకొని సంతోష పడుతున్నారు…