PM Modi turns 75: 1950వ సంవత్సరంలో భారత్ రిపబ్లిక్ గా అవతరించింది. అదే సంవత్సరం నరేంద్రమోడీ జన్మించారు. ఆరోజునుంచి పెద్దయ్యాక యుక్తవయసులో మోడీకి పెళ్లి అయ్యింది. అయితే తనకు కుటుంబం ముఖ్యం కాదని.. దేశమే ముఖ్యం అని.. దేశాటనకు బయలు దేరిన మహానుభావుడు. నేషన్ ఫస్ట్.. సొసైటీ నెక్ట్స్.. ఇండివ్యూజువల్ లాస్ట్ అని దాన్ని అమలు చేసిన ఘనత మోడీకి తగ్గుతుంది.
ప్రచారక్ గా.. రాజకీయ కార్యకర్తగా పరివర్తనం చెందాడు. 1987లో బీజేపీ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్ చార్జిగా మోడీని నియమించింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి ఘనవిజయాన్ని మోడీ సాధించిపెట్టాడు. అలా మొదలైన మోడీ ప్రస్థానం.. 2001లో గుజరాత్ సీఎంగా అవకాశం క్లిష్ట పరిస్థితుల్లో దొరికింది. డైరెక్టుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కేవలం 5 నెలల్లోనే గోద్రాలో అల్లర్లు జరిగి ట్రైన్ బోగీని తగులబెట్టారు. గుజరాత్ అల్లర్లతో వందలాది మంది చనిపోయారు. టీవీ, మీడియాలో మోడీ వ్యక్తిత్వ హననం జరిగింది. అది మామూలు విషయం కాదు. భారత్ లో, అమెరికాలో ఆయనకు విషమ పరిస్థితి ఎదురైంది. మోడీ రాజకీయ జీవితం సమాప్తం అని అనుకున్నారు. కానీ కడిగిన ముత్యంలో ఆ కేసులో బయటకొచ్చారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా మోడీ పాత్రను నిరూపించలేకపోయింది. గుజరాత్ ను రోల్ మోడల్ గా దేశంలో మోడీకి పేరు తెచ్చింది.
గుజరాత్ మోడల్ తో 2014 మేలో భారత ప్రధానిగా ఎదిగారు. భారతమాత ముద్దు బిడ్డ 75 ఏళ్ళ మోడీకి శుభాకాంక్షలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలోచూడొచ్చు.
