Bithiri Sathi Remuneration: ప్రస్తుతం బుల్లితెర ప్రపంచంలో *బిత్తిరి సత్తి’ పేరు తెలియని వారు ఉండరు. అంతటి పాపులారిటీ సంపాదించుకున్న సత్తి తనదైన వేష, భాషతో అందరిని ఆకట్టుకుంటున్నారు. తన చేష్టలతో అందరిని నవ్విస్తున్నాడు. అతడి అప్రతిహ విజయయాత్ర కొనసాగుతోంది. యాంకర్ సుమ కంటే అధిక పారితోషికం తీసుకుంటున్నాడంటే అతడి ప్రతిభ ఏపాటిదో ఇప్పటికే అర్థమై ఉంటుంది. తీన్మార్ వార్తల ద్వారా వెలుగులోకి వచ్చిన సత్తి అనతి కాలంలోనే అందరి మన్ననలు పొంది తన యాసతో మెప్పిస్తున్నాడు. హాస్యంతో పాటు అన్నింటిని సమపాళ్లలో అందిస్తూ తన మనుగడకు మంచి బాటలు వేసుకుంటున్నాడు.
ఇటీవల కాలంలో సినిమా ఇంటర్వ్యూలకు భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. పైగా అతడు చేసిన ఇంటర్వ్యూలన్ని సక్సెస్ అవుతున్నాయి. సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడి రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడు. బుల్లితెరతోపాటు వెండితెర మీద కూడా తన ముద్ర వేస్తున్నాడు. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ నవ్వులు పండిస్తున్నాడు. దీంతో సత్తి రెండు చేతులా సంపాదిస్తున్నాడు. బుల్లితెరలో తనకు ఎదురేలేదన్నట్లుగా సత్తి ప్రస్థానం కొనసాగుతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు సత్తి చేసిన ఇంటర్వ్యూ ప్లస్ అయిందని జూనియర్ ఎన్టీఆర్ నమ్ముతున్నాడు. సినిమా విడుదలకు ముందు సత్తి చేసిన ఇంటర్వ్యూతో సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిందని విశ్వసిస్తున్నారు. అందుకే సత్తికి ప్రత్యేకంగా ప్రశంసలు అందజేశారు. ఇంకా సర్కారు వారి పాట సినిమాకు ముందు కూడా మహేశ్ బాబుతో సత్తి చేసిన ఇంటర్వ్యూ పేలింది. దీంతో మహేశ్ బాబు కూడా సత్తి అంటే అభిమానమే చూపిస్తున్నాడు. ఇంకా ఏ సినిమాకైనా సత్తి ఇంటర్వ్యూ తీసుకోవాలని చూస్తున్నారు. ఇదే కోవలో ఎఫ్ -3 సినిమాకు ముందు వెంకీతో బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశాడు.
సినిమాల విజయంలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రమోషన్లకు బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ లు ప్లస్ కావడంతో అతడికి మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో ఒక్కో ఇంటర్వ్యూకు రెండు నుంచి మూడు లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సత్తి సంపాదన ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనికి తోడు ప్రైవేటు యాడ్స్ లలో కూడా నటిస్తూ సత్తి తన ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం సత్తి ఒక్క రోజు ఆదాయం కనీసం ఆరు లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇలా సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న సత్తి మరిన్ని విజయాలు సొంతం చేసుకోవడం ఖాయమే.
బిత్తిరి సత్తి అసలు పేరు రవికుమార్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సొంతూరు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సత్తి అంచెలంచెలుగా ఎదిగి తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వేలతో ప్రారంభమైన అతడి సంపాదన ప్రస్తుతం లక్షలకు చేరడం తెలిసిందే. పేదరికంలో పుట్టడం తప్పు కాదు పేదరికంలో చావడం తప్పు అనే వాదాన్ని నిజం చేస్తూ తన ఎదుగుదలలో మైలురాళ్లు దాటుకుని మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటున్నాడు.
పలు టీవీ షోల్లో ప్రత్యేకంగా పాల్గొంటూ తన మాటలతో అందరిని మంత్రముగ్గుల్ని చేస్తున్నాడు. తన యాసతో ఆకట్టుకుంటున్నాడు. ఎప్పుడు ఏదో ఓ షోలో ప్రత్యక్షమవుతూ నవ్వులు పూయిస్తున్నాడు. బిత్తిరి సత్తి సంపాదనతోపాటు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడు. సినిమాల్లో కూడా నటించి తన పాత్రలకు న్యాయం చేస్తున్నాడు. బత్తిరి సత్తికి వస్తున్న ఆదరణ మామూలుది కాదు. ఎంతో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించే క్రమంలో అతడి ప్రయాణం ఇంకా వేగంగా కొనసాగాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
Also Read:Bigg Boss 4 Abhijeet: బిగ్ బాస్ 4 అభిజిత్ ఏమైపోయ్యడు.. ఇప్పుడు ఎం చేస్తున్నాడో తెలుసా?
Recommended Videos