I Bomma: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న సమస్య పైరసీ…గత కొన్ని సంవత్సరాల నుంచి పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ విపరీతంగా నష్టపోతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఒక సినిమాని చాలా ఎఫర్స్ పెట్టి చాలా మంది టెక్నీషియన్స్ కలిసి చేస్తారు. కానీ కొంతమంది దాన్ని ఈజీగా కొన్ని క్షణాల్లోనే పైరసీ చేసి వివిధ సైట్లలో పెడుతున్నారు. దీనివల్ల సినిమా ఇండస్ట్రీలో చాలామంది చాలావరకు నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది… గతంలో ఐ బొమ్మ సైట్ ను నడిపించే కొంతమందిని హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ అండ్ టీమ్ పట్టుకున్నారు. మొత్తానికైతే గతంలో ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మషన్ తెలుసుకొని మిగతా వాళ్ళను కూడా పట్టుకుంటామని హెచ్చరించినప్పటికి ఐ బొమ్మ వాళ్ళు మాత్రం మమ్మల్ని ఎవ్వరు పట్టుకోలేరు అంటూ ఒక నోట్ రిలీజ్ చేశారు. మొత్తానికైతే దీన్ని ప్రెస్టేజీయస్ ఇష్యూ గా తీసుకున్న మన పోలీసులు ఐ బొమ్మలో మేజర్ గా సినిమాలను పైరసీ చేసే ఇమ్మాడి రవిని పట్టుకున్నారు. కరేబియన్ దీవుల్లో ఉండి పైరసీ ని నడిపిస్తున్న రవి ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ప్లాన్ వేసి మరి పట్టుకున్నారు…నిజానికి ఐ బొమ్మలో సినిమాలను రిలీజ్ అవ్వకుండానే వాళ్ళు ఎలా పెడుతున్నారు అని మనలో చాలామందికి కొన్ని సందేహాలైతే ఉంటాయి. ముఖ్యంగా సినిమాను క్యూబ్ లో గాని, యుఎఫ్ఓ వాళ్లకు ఫుటేజ్ మొత్తాన్ని పంపిస్తారు.
ఒకప్పుడు రీల్స్ రూపంలో ఉండేది కాబట్టి దాన్ని బాక్స్ ల రూపంలో థియేటర్ యాజమాన్యానికి పంపించేవారు. కానీ ఇప్పుడు అంత డిజిటల్ అయిపోయింది. కాబట్టి క్యూబ్ నుంచి గాని యూఎఫ్ఓ వాళ్ళ నుంచి గాని సినిమా డైరెక్ట్ గా రిలీజ్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే క్యూబ్ లో గాని, యూఎఫ్ఓ లో గాని పనిచేసే ఎంప్లాయ్ యొక్క ఐడి ద్వారా వాళ్ల సిస్టం ని హ్యాక్ చేసి అందులో నుంచి లాక్కుంటున్నారు.
ఇక హిట్ 3 మూవీ విషయంలో ఇదే జరిగింది. సినిమా రిలీజ్ అవ్వడానికి కొన్ని గంటల ముందే ఐ బొమ్మలో ఆ సినిమా రావడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది…ఇక అలాగే ఐ బొమ్మలో ఓపెన్ చేయగానే కొన్ని బెట్టింగ్ ఆప్షన్స్ సైతం ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. దీనివల్ల కొంతమంది బెట్టింగ్ అప్స్ ఓపెన్ చేసి దానికి ఎడిక్ట్ అయిపోయి అందులో బెట్టింగ్ పెట్టి సర్వం కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి.
కాబట్టి దీనిని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ పోలీసులు మోటివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇమ్మాడి రవి నుంచి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకొని మొత్తానికైతే ఐ బొమ్మ లాంటి సైట్లను క్లోజ్ చేయాలనే ఉద్దేశ్యంతో మన పోలీసులైతే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనను ఇంటరాగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…