Vaibhav Suryavanshi: వర్ధమాన ఆటగాడిగా.. విధ్వంసానికి మారుపేరుగా మారిపోయాడు బీహార్ కుర్రాడు వైభవ్ సూర్య వంశీ. ఇంకా నూనూగు మీసాలు కూడా రాకముందే అతడు మైదానంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఐపీఎల్ లో 2025 సీజన్లో ఏకంగా సెంచరీ చేసిన అతడు.. ఇటీవల జరిగిన ఓ టోర్నీలో కూడా మెరుపు శతకాన్ని సాధించాడు.. యూఏఈ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్లో కేవలం 32 బంతుల్లోనే అతడు శతక గర్జన చేశాడు.
ఈస్థాయిలో బ్యాటింగ్ చేసిన తర్వాత సూర్య వంశీ మీద ప్రశంసలు పెరిగిపోతున్నాయి. అతడి ఆట తీరు గొప్పగా ఉందని విమర్శకులు కూడా అభినందిస్తున్నారు. మాజీ క్రికెటర్లు అతని ఆట తీరని చూసి తన్మయత్వం చెందుతున్నారు.. అతనికి మరిన్ని అవకాశాలు కల్పిస్తే టీమిండియాలో పెను సంచలనం సృష్టిస్తాడని.. ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని శాశిస్తాడని వారు అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి ఇంత చిన్న వయసులో క్రికెటర్ కావడమే గొప్ప విషయమైతే.. ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడం ఇంకా అద్భుతమైన విషయం. పైగా బ్యాటింగ్లో అంచనాలకు మించి రాణిస్తూ అదరగొడుతున్నాడు వైభవ్.. వాస్తవానికి వైభవ్ ఈ స్థాయికి రావడానికి అతడి తండ్రి కృషి విపరీతంగా ఉంది. వైభవ్ క్రికెటర్ కావడం కోసం అతడి తండ్రి చాలా త్యాగాలు చేశాడు. తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. చివరికి తన ఇంటి స్థలాన్ని క్రికెట్ గ్రౌండ్ గా మార్చాడు. అందులోనే వైభవ్ ప్రాక్టీస్ చేసేవాడు.
వైభవ్ ఈ స్థాయికి వచ్చినప్పటికీ అతడి తండ్రికి అనుకున్నంత సంతృప్తి లేదని తెలుస్తోంది. ఎందుకంటే వైభవ్ డబుల్ సెంచరీ చేసినప్పటికీ ఇంకా కొన్ని పరుగులు చేస్తే బాగుండని అతడి తండ్రి భావిస్తాడట. ఇదే విషయాన్ని వైభవ్ వెల్లడించాడు. బిసిసిఐ నిర్వహించిన ఇంటర్వ్యూలో అతడు ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
“నేను ద్వి శతకం చేసినప్పటికీ మా నాన్న సంతృప్తి చెందడు. ఇంకా కొన్ని పరుగులు చేస్తే బాగుందని అనుకుంటాడు. మా అమ్మ మాత్రం సెంచరీ చేసినా, 0 పరుగులకు అవుట్ అయినా సంతోషపడుతుంది. బాగా ఆడమని మాత్రమే చెబుతుంది. అంత తప్ప నాకు టార్గెట్లు విధించదని” వైభవ్ బీసీసీఐ నిర్వహించిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు..
A peek into the strong mindset of a special talent – By @ameyatilak
https://t.co/y0yiu3E5qV#RisingStarsAsiaCup— BCCI (@BCCI) November 15, 2025