Extramarital Affairs: పెళ్లంటే ఒక ప్రమాణం. భర్త అంటే భరించేవాడు. భార్య అంటే కలకాలం వెంట నిలిచి ఉండే తోడు.. పిల్లలు అంటే మోయాలి అనిపించే బరువు.. సంసారం గురించి, కుటుంబ బాధ్యతల గురించి ఓ ఇంగ్లీష్ కవిత్వానికి మాకు తెలిసిన తెలుగులో చేసిన అనువాదం ఇది. “ధర్మార్థ కామములోన ఏనాడు ఈమె తోడును నేను విడును” పెళ్లి పీటల మీద నూతన వధూవరులు ఉన్నప్పుడు చేయించే ప్రమాణం ఇది. నాతిచరామి అంటే న+ అతి చరామి.. అంటే అతిక్రమించను అని అర్థం. కానీ ఇదే సమయంలో వధువుకు ఇలాంటి తిప్పలు ఉండవు. ఆ మాటకు వస్తే ఎటువంటి ప్రమాణాలు కూడా ఉండవు. నిన్న మొన్నటి వరకు పురుషులే పెళ్లినాటి ప్రమాణాన్ని అతిక్రమించి తిరిగేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. పురుషుల స్థానంలో స్త్రీలు వచ్చి చేరుతున్నారు. అలాగని అందరూ స్త్రీలు అలాంటివారు కాదు. కూరగాయల్లో మంచి కూరగాయలు, పుచ్చు కూరగాయలు ఉన్నట్టు.. స్త్రీల యందు ఈ స్త్రీలు వేరయా!

అమే చిచ్చు
ఇటీవల కాలంలో స్త్రీలు పెళ్లి నాటి ప్రమాణాలను అతిక్రమిస్తున్నారు. దాంపత్య జీవితంలో చిచ్చు రేపుతున్నారు. భర్త తీరు నచ్చకుంటే, అతడి ప్రవర్తన తీరు బాగోకపోతే విడాకులు ఇచ్చి నచ్చిన వాడిని చేసుకోవచ్చు. ఇందులో ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మధ్యలో వస్తున్న మూడో వ్యక్తి వల్లే జరగరాని ఘోరాలు జరుగుతున్నాయి. ఇందుకు కారణం ఆ మూడో వ్యక్తిని ఆమె ఆహ్వానిస్తుండడం వల్లే దారుణాలు వెలుగుచూస్తున్నాయి.
కటకటలా పాలవుతున్నారు
ప్రియుడితో కలిసి జీవితాన్ని గడిపేందుకు జీవిత భాగస్వామిని హత్య చేసి.. ఆపై నేరం బయటపడటంతో పూజలు లెక్కిస్తున్న వారు ఎంతోమంది. వారి తీరు వల్ల కుటుంబం పరువు రోడ్డున పడుతోంది. ఇక జైల్లో ఉంటున్న వారు కుటుంబ సభ్యుల పలకరింపు లేక బిక్కుబిక్కుమంటూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేయడమే కాదు.. వారి బంగారు భవిష్యత్తు నిలువునా నాశనం అవుతున్నది. తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయి, మరొకరు జైలుకు వెళ్తుండడంతో పిల్లలు అనాధలుగా మారుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో గత ఏడాది 1026 హత్యలు జరిగాయి.. అందులో వివాహేతర సంబంధాల కారణంగా జరిగిన హత్యలు 115. భార్యలను/ ప్రియులను చంపిన కేసులు ఇవి.. సగటున ప్రతి మూడు రోజులకు ఒకరు ఈ కారణంగా హత్యకు గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.. ఈ విషయంలో 2021లో ఏకంగా 232 కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది.. ఇక మనకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో 2021లో వివాహేతర సంబంధాల కారణంగా జరిగిన హత్యల సంఖ్య 186.
జైలు జీవితం నరకప్రాయం
వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న మహిళలు, వారికి సహకరించే ప్రియులు మర్చిపోతున్న విషయం ఏమిటంటే.. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో ఏ నేరమైన చేసి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.. అది తెలిసే వరకే అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది.. వ్యామోహంలో తాము చేసిన తప్పు తెలుసుకుని ప్రతిక్షణం నరకం అనుభవిస్తూ ఉంటారు.. కుటుంబ సభ్యులు జైలుకువచ్చి పలకరించే పరిస్థితి ఉండదు.. అన్న బిడ్డలను జైలు అధికారులు అసలు దగ్గరికి కూడా రానివ్వరు.. అందరూ ఉన్నా నాలుగు గోడల మధ్య ఒంటరి జీవితాన్ని గడపాల్సిందే. జైలు నుంచి విడుదలైన తర్వాత ఎటు వెళ్లాలో తెలియదు. దీంతో చాలామంది వసతి గృహాల్లో తలదాచుకుంటున్నారు.. ఇలాంటి ఘటనల్లో పూకా నష్టపోయేది పిల్లలే.. తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయి, మరొకరు జైల్లో ఉంటే ఆ పిల్లల్ని అక్కున చేర్చుకుంటున్న బంధువుల సంఖ్య కూడా తక్కువే. దీంతో ఆ చిన్నారులు అనాధాశ్రమాల పాలవుతున్నారు. ఒకవేళ బంధువుల పంచన చేరినప్పటికీ సహజమైన అనుబంధాలు, ఆప్యాయతలు లేక వారి మనసులు దారి తప్పుతున్నాయి.
కారణాలు ఇవేనా
చాలావరకు వివాహేతర సంబంధాలు లైంగిక కోరికలు తీరకపోవడం వల్లే కారణం కాదని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు లేకపోవడం.. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం… ఒకరి మాటకు మరొకరు గౌరవం ఇవ్వకపోవడం.. సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవడంతో చిన్నచిన్న కారణాలకే గొడవలు మొదలవుతున్నాయి. అవి చినికి చినికి గాలి వానలా మారుతున్నాయి. అదే సమయంలో వ్యక్తి చేరడంతో మూడుముళ్ల బంధం ముక్కలవుతోంది. జీవిత భాగస్వామి తనకు తగిన వ్యక్తి కాదనో, ఆర్థిక పరిస్థితుల వల్లో, జీవితం సరిగా లేకపోవడమో.. ఇలా ఏదో ఒక అసంతృప్తి, అపోహ, అనుమానం, పనిచేసే చోట ఆకర్షణ వంటి కారణాలతో కొంతమంది, థ్రిల్ కోసం, కొత్త దనం కోసం, కెరియర్ కోసం మరికొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు.. ఇవి కాపురాలను కూల్చుతున్నాయి. ఇక పెరుగుతున్న సామాజిక మాధ్యమాల వాడకం వల్ల ఇటువంటి వివాహేతర సంబంధాలు కూడా త్వరగా ఏర్పడుతున్నాయి.. గతంలో ఒక వ్యక్తికి వేరే ప్రాంతంలో ఉన్న ఇంకొకరితో పరిచయం కావాలంటే అంత సులువుగా కుదిరేది కాదు.. కానీ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటివి వచ్చిన తర్వాత పరిచయాలు సులువయ్యాయి..

నిజమని లొంగిపోతున్నారు
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వారు మాట్లాడే తీయటి మాటలకు పొంగిపోతారు.. అవే నిజం అనుకొని లొంగిపోతారు.. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే.. ఒక వ్యక్తి లేదా ఒక మహిళ నచ్చకుంటే విడాకులు ఇచ్చి నచ్చిన వారిని చేసుకోవచ్చు.. రాజ్యాంగం కూడా అదే చెబుతోంది.. కానీ ఒకరి మోజులో పడి కట్టుకున్న వారిని కడతేర్చితే ఆ నేరం జీవితాంతం నరకం చూపిస్తుంది. ప్రస్తుతం ఓ సెక్షన్ మహిళలు అటువంటి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అందుకే పరాయి మోజు మానుకుంటే ఇంటికి, ఒంటికి మంచిది.