Ugram Twitter Talk: ఉగ్రం ట్విట్టర్ టాక్: అల్లరి నరేష్ పోలీస్ గా సక్సెస్ అయ్యాడా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

ఉగ్రం హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రధానంగా తెరకెక్కింది. ఈ మాఫియా కారణంగా జరుగుతున్న ఆకృత్యాలను యధార్థ సంఘటనల ఆధారంగా చెప్పే ప్రయత్నం జరిగింది.

Written By: Shiva, Updated On : May 5, 2023 8:26 am
Follow us on

Ugram Twitter Talk: అల్లరి నరేష్ పరాజయాల్లో ఉన్నారు. ఆయన సాలిడ్ హిట్ కొట్టి ఏళ్ళు గడిచి పోతుంది. సుడిగాడు చిత్రం తర్వాత ఆయనకు ఆ రేంజ్ హిట్ పడలేదు. కామెడీ చిత్రాలు వరుసగా బెడిసికొట్టడంతో సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. నాంది మూవీ ఓ మోస్తరు విజయం సొంతం చేసుకుంది. దీంతో మరో ఛాన్స్ దర్శకుడు విజయ్ కనకమేడలకు ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ తెరకెక్కిన రెండో చిత్రం ఉగ్రం. అల్లరి నరేష్ పోలీస్ రోల్ చేశారు. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మే 5న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. యూఎస్ లో ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

ఉగ్రం హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రధానంగా తెరకెక్కింది. ఈ మాఫియా కారణంగా జరుగుతున్న ఆకృత్యాలను యధార్థ సంఘటనల ఆధారంగా చెప్పే ప్రయత్నం జరిగింది. చాలా సినిమాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉగ్రం మూవీలో మరింత లోతుగా చర్చించినట్లు ఉన్నారు. సిఐ శివ కుమార్ గా అల్లరి నరేష్ డైనమిక్ పోలీస్ రోల్ చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాకు సీఐ నరేష్ కూడా బాధితుడే. అతిపెద్ద నెట్వర్క్ గా ఉన్న ఈ మాఫియా మీద అతడు ఎలా పగ తీర్చుకున్నాడు అనేది… అసలు కథ.

ఆడియన్స్ అభిప్రాయంలో ఉగ్రం యావరేజ్ ఫిల్మ్. దర్శకుడు మంచి పాయింట్ ని ఎంచుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయాడు. సినిమా ఆరంభం బాగుంది. ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఆ టెంపో కొనసాగించేలేకపోయారు. బలహీనమైన కథనం ప్రేక్షకుడిని నిరాశకు గురి చేస్తుంది. అల్లరి నరేష్ మాత్రం మెప్పించారంటున్నారు. కామెడీ హీరో నుండి ఓ సిన్సియర్ పోలీస్ గా ఆయన ట్రాన్స్ఫార్మేషన్ అదిరింది. తన పాత్రకు ఆయన వంద శాతం న్యాయం చేశాడంటున్నారు.

అయితే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువైపోయాయి. మితిమీరిన హీరోయిజంతో మూవీ సాగిందంటున్నారు. లెక్కకు మించిన యాక్షన్ సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి. నెమ్మదిగా సాగే కథనం మరో మైనస్ పాయింట్ అంటున్నారు. హీరోయిన్ తో అల్లరి నరేష్ రొమాంటిక్ ఎపిసోడ్స్ నిరాశపరిచాయని అంటున్నారు. అయితే ఉగ్రం మూవీలో కొన్ని మెప్పించే అంశాలు ఉన్నాయి. అల్లరి నరేష్ నటన, కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మొత్తంగా మంచి పాయింట్ ఎంచుకున్న దర్శకుడు ప్రభావంతంగా తెరకెక్కించడంలో విఫలం చెందారన్న మాట వినిపిస్తోంది.

https://twitter.com/saisrikardhava1/status/1654260351402139649