https://oktelugu.com/

Baahubali: ‘బాహుబలి’లో ఆ సీన్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశారో తెలుసా?

బాహుబలి ది బిగినింగ్ లో విగ్రహం పైకి లేపే సీన్ చూస్తే ఊపిరి బిగపట్టినట్లవుతుంది. అయితే ఈ సీన్ ను ఇంటర్వెల్ తరువాత పెట్టాలనుకున్నారట. అయితే ఇంటర్వెల్ ముందు చూపిస్తేనే హైలెట్ గా మారతుందని సూచించారట. దీని కోసం చాలా రోజుల పాటు కసరత్తు చేశారట.

Written By:
  • Srinivas
  • , Updated On : April 27, 2023 12:42 pm
    Follow us on

    Baahubali: తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన ‘బాహుబలి’ సినిమా గురించి ఎవరూ మర్చిపోరు. రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ టీవీల్లో వస్తూ అలరిస్తూ ఉంటుంది. హై టెక్నాలజీతో పాటు ఎంతో చరిత్ర కలిగిన బాహుబలి గురించి చెబుతూ తీసిన ఇందులో ప్రభాస్, రానాలతో పాటు అనుష్క, తమన్నలు నటించారు. ఈ సినిమా పాన్ వరల్డ్ లెవల్లో ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ సినిమాను తెరపై చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది.

    ఆ అద్భుతాలు రావడానికి మూవీ టీం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. వందల మంచిని మ్యానేజ్ చేస్తూ అనుకున్న సీన్ వచ్చేవరకు రాజమౌళి నిద్రపోలేదంటే నమ్మశక్యం కాదు. బాహుబలి సినిమా రిలీజ్ అయిన తరువాత ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వీటిలో ఒక్కోసీన్ షూటింగ్ తీస్తున్న సమయంలో వారు ఎలా కష్టపడ్డారో చూస్తే షాక్ అవుతారు.

    మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తయితే బాహుబలి ప్రత్యేకం అని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. మల్టీస్టారర్ మూవీ మాత్రమే కాకుండా కళ్లు చెదిరే ఆర్కిటెక్, ఒల్లు గగుర్బోలిచే యుద్ధ సన్నివేశాలు, కన్నీళ్లు తెప్పించే సంఘటనలు ఆకట్టుకుంటాయి. ఈ సీన్స్ ఒక్కసారికే ఓకే చేయలేదట. ఇవి రావడానికి రాజమౌళి యాక్టర్స్ ను కొంచెం ఎక్కువగానే కష్టపెట్టారట. ఇక ఏ సినిమాకు చేయలేనంతగా ఈ సినిమాకు 15వేల స్టోరీ బోర్డు స్కెచ్ ను రూపొందించారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఏడాది పాటు నిర్వహించాట.

    బాహుబలి ది బిగినింగ్ లో విగ్రహం పైకి లేపే సీన్ చూస్తే ఊపిరి బిగపట్టినట్లవుతుంది. అయితే ఈ సీన్ ను ఇంటర్వెల్ తరువాత పెట్టాలనుకున్నారట. అయితే ఇంటర్వెల్ ముందు చూపిస్తేనే హైలెట్ గా మారతుందని సూచించారట. దీని కోసం చాలా రోజుల పాటు కసరత్తు చేశారట. ఇక ఇందులో ప్రభాస్ తో పాటు రానా, తమన్నా, అనుష్కలు కత్తిసామును నేర్చుకున్నారు. వీరు ఆ ట్రైనింగ్ తీసుకోవడానికి చాలా రోజులు తీసుకున్నారట.

    వీటితో పాటు బాహుబలి సెట్ కుదరడానికి ఆరు నెలల సమయం పట్టిందట. మార్చి మార్చి వేస్తూ మొత్తంగా మాహిష్మతి సామ్రాజ్యాన్ని నిర్మించారట. దీనిని రెండు పార్టులలో చూపించి ఆకట్టుకున్నారు. ఇలా ప్రతీ సీన్ కోసం చాలా సమయం తీసుకోవడం వల్లే ఒక్కో పార్టు తీయడానికి 3 సంవత్సరాలు పట్టిందట. ఇలా ఆరు సంవత్సరాల పాటు ఇందులో పనిచేసే నటులు బహుబలికి అంకితం అయ్యారు.

    బాహుబలి మూవీ షూటింగ్ ఇలా జరిగింది! Making of Bahubali - The Beginning #TeluguFactor