Akhil Agent Movie Review : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్’ రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు మలయాళం బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.అక్కినేని అభిమానులు ఈ చిత్రం పై పెట్టుకున్న ఆశలు మామూలివి కాదు.అయితే ఈ సినిమా ప్రకటించిన సమయం లో ఉన్న హైప్ , మార్కెట్ లో ఇప్పుడు లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పట్లో 60 కోట్ల రూపాయిల విలువ చేసేది. కానీ ఇప్పుడు 37 కోట్ల రూపాయిల తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
సినిమా అనుకున్న సమయం లో పూర్తి అవ్వకపోవడం, చాలా సార్లు వాయిదా పడడం, దానికి తోడు ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన పాటలలో ఒక్కటి కూడా హిట్ కాకపోవడం ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలను తగ్గించేసింది. అయితే రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ మాత్రం పర్వాలేదు అని అనిపించింది. ఈ ట్రైలర్ లో సురేందర్ రెడ్డి మార్కు కనిపించింది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో నిన్న రాత్రి దుబాయి లో కొంతమంది ప్రముఖులకు వేసి చూపించారు. అక్కడి నుండి వస్తున్న టాక్ ఏమిటంటే,డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రం తో తన మార్కు ఏంటో చూపించాడని, ఓవరాల్ గా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ని ఆడియన్స్ కి అందించాడని, సమ్మర్ సీజన్ కనుక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి.
అయితే ‘ఏజెంట్’ చిత్రానికి ‘విరూపాక్ష’ రూపం లో ప్రమాదం పొంచి ఉంది.ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. టాక్ కూడా గ్రౌండ్ లెవెల్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ లో రీచ్ అయ్యింది. మరి ఏజెంట్ చిత్రం ఆ సినిమాని తట్టుకొని నిలబడాలంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావాలి, లేకుంటే ఆడియన్స్ ఈ వీకెండ్ కూడా ‘విరూపాక్ష’ చిత్రానికే ఎక్కువ మొగ్గు చూపిస్తారు. చూడాలి మరి టాక్ వస్తుందో లేదో!.