Trivikram Sithara collaboration: ఒక సినిమా తీయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. చేతిలో కథ ఉన్నంత మాత్రాన సినిమా చేయొచ్చు అనుకోవడం మూర్ఖత్వం అవుతోంది. ఎందుకంటే ఆ కథని ప్రొడ్యూసర్ కి చెప్పి అతన్ని ఒప్పించి, బడ్జెట్ ను రిలీజ్ చేసుకొని సినిమా చేసి సక్సెస్ సాధించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఒక దర్శకుడు తన సత్తా చాటుకున్నవాడవుతాడు… ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లందరు ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న వారే కావడం విశేషం… త్రివిక్రమ్ లాంటి దర్శకుడు మొదట రైటర్ గా అతని కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. 90% సక్సెస్ రేట్ తో త్రివిక్రమ్ ముందుకు దూసుకెళ్తున్నాడు… ఇక ఇప్పుడు సితార ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రొడ్యూసర్ నాగ వంశీ తోపాటు త్రివిక్రమ్ వాళ్ళ భార్య సౌజన్య కూడా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది…ఇక ఈ బ్యానర్ లో ఒక సినిమా పట్టలెక్కాంటే ఆ కథ ముందుగా త్రివిక్రమ్ దగ్గరికి వెళ్తుంది. ఆయన ఫైనలైజ్ చేసిన తర్వాతే సినిమా పట్టాలెక్కుతోంది. ఆ స్టోరీ లో ఏమైనా చేంజెస్ ఉంటే ఆయన చేస్తాడు.
ఆ దర్శకుడికి చెప్పి కొన్ని మార్పులు చేర్పులు చేయమని కూడా సలహాలను ఇస్తుంటాడు. ఇక సినిమా అవుట్ పుట్ ను కూడా తను చూస్తూ ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నట్టుగా తెలిస్తే రీ షూట్ పెట్టమని చెబుతూ ఉంటాడు. మొత్తానికైతే త్రివిక్రమ్ తన సినిమాను చేసుకుంటూనే సితార బ్యానర్ ను సైతం ఒక కంట కనిపెడుతుంటాడు.
ఇక ఆ బ్యానర్లో పట్టలెక్కే ప్రతి సినిమా మీద త్రివిక్రమ్ కొంతవరకు కమిషన్స్ తీసుకుంటాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక మరి కొంతమంది మాత్రం త్రివిక్రమ్ నాగ వంశీ కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ తోనే స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తాడు తప్ప ఆయన ప్రత్యేకించి డబ్బులు ఏమి తీసుకోడు అని ఇంకొంతమంది చెబుతున్నారు.
ఇక త్రివిక్రమ్ వాళ్ళ వైఫ్ కూడా సితార లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగుతోంది. కాబట్టి ఆమె కోసం కథలను సెట్ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడని కొందరు చెబుతున్నారు. ఇక ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తుంటారు. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే సామెతను ప్రతి ఒక్కరూ ఫాలో అవుతూ ఉంటారు. దానివల్లే అవకాశం ఉన్నప్పుడే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. మరి మొత్తానికైతే త్రివిక్రమ్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు అంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తుండటం విశేషం…