Thaman dominates Anirudh: సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ల చూసే జనాలు థియేటర్ కి వస్తారు. అందుకే అభిమానుల దృష్టిలో స్టార్ హీరోలే తోపులు…నిజానికి ఒక సినిమా సక్సెస్ లో హీరో, దర్శకుడితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కూడా కీలకపాత్ర వహిస్తాడనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు చాలామంది సంగీత దర్శకులు వాళ్ళు ఇచ్చిన పాటలతో సినిమా రేంజ్ ను మార్చేశారు. గత కొన్ని రోజుల నుంచి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుధ్ ఇచ్చినట్టుగా తెలుగు సంగీత దర్శకులెవ్వరు మ్యూజిక్ ని ఇవ్వలేరు అంటూ కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. కానీ ఓజీ సినిమా చూసిన తర్వాత బ్యా గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం లో తమన్ తర్వాతే ఎవరైనా అనే రేంజ్ కి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల నుంచి తమన్ ను అందరు తక్కువ చేస్తున్నారు. కానీ క్వాలిటీ మ్యూజిక్ అందించగలిగే కెపాసిటి తమన్ కి ఉందని ప్రూవ్ చేసుకున్నాడు…
ఇక ఇది తెలుసుకున్న తెలుగు ప్రేక్షకులందరు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాను నడిపించగలిగే కెపాసిటిని సంపాదించుకున్నాడు. తనని ఢీకొట్టడం మీ వల్ల కాదు అంటూ తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఇన్ డైరెక్టుగా అనిరుధ్ కి వార్నింగ్ ఇస్తున్నారు…
అనిరుధ్ వరుసగా విక్రమ్, జైలర్, లియో లాంటి సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. దాంతో తెలుగు దర్శకులు సైతం అనిరుధ్ వెంట పడడంతో ఆయనకి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇక దాంతో రెమ్యూనరేషన్ ని కూడా భారీగా ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తనకు పోటీ ఎవరు రారు అనే ధోరణిలో అనిరుధ్ తనను తాను చాలా గొప్పగా ఊహించుకున్నాడు.
కానీ తమన్ రూపంలో ఆయనకు ఒక భారీ పోటీ ఎదురవ్వడమే కాకుండా అనిరుధ్ కంటే తక్కువ టైమ్ లో మ్యూజిక్ ని ఇస్తూ క్వాలిటీని మైంటైన్ చేస్తూ సినిమాలోని సీన్ ని ఎలివేట్ చేయగలిగే కెపాసిటి తన దగ్గర ఉందని చాలామంది సినిమా మేధావులు సైతం ఒప్పుకుంటున్నారు. దాంతో అనిరుధ్ కొంతవరకు వెనకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాబోయే సినిమాలతో వీళ్ళిద్దరిలో ఎవరు క్వాలిటీ మ్యూజిక్ ని అందిస్తారు. తద్వారా ఎవరు ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదుగుతారు అనేది తెలియాల్సి ఉంది…