MAD Square
MAD Square: 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘మ్యాడ్'(MAD Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) బామ్మర్ది నితిన్ నార్నే(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపిన చిత్రం గా నిల్చింది.ఫుల్ రన్ లో దాదాపుగా 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి ఓటీటీ లో,టీవీ టెలికాస్ట్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూత్ మొత్తం ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్(MAD Square) ని ప్రకటించి చాలా రోజులే అయ్యింది. ఇప్పుడు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తోనే ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసారు. కచ్చితంగా ఈ సీక్వెల్ కుంభస్థలం బద్దలు కొట్టబోతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. అందుకే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 45 కోట్ల రూపాయిలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. మొదటి భాగానికి కనీసం పది కోట్ల రూపాయిల బిజినెస్ కూడా జరగలేదు, కానీ దీనికి నాలుగు రెట్లు బిజినెస్ జరిగిందంటే ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి పొరపాటున పర్వాలేదు, బాగానే ఉంది అనే రేంజ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఏకంగా వంద కోట్ల రూపాయిల షేర్ ని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈమధ్య కాలం లో పెద్ద సినిమాలకంటే మీడియం రేంజ్ సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి గ్రాస్ వసూళ్లను రాబడుతున్నాయి. ఈ సినిమా కూడా ఆ జాబితాలోకి చేరబోతోంది. ఈ సినిమా తర్వాత నార్నే నితిన్, సంగీత్ శోభన్ రేంజ్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నార్నే నితిన్ నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అదే విధంగా సంగీత్ శోభన్ కామెడీ కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా హిట్ అయితే వాళ్లిద్దరూ మరో లెవెల్ కి వెళ్ళిపోయినట్టే, చూడాలి మరి ఏమి జరగబోతుందో. టిల్లు స్క్వేర్ , దేవర, లక్కీ భాస్కర్, డాకు మహారాజ్ వంటి వరుస సూపర్ హిట్స్ సినిమాలను అందించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కి ఈ చిత్రం మరో సక్సెస్ ఫుల్ వెంచర్ అవ్వబోతుంది.
Also Read: ఎట్టకేలకు ‘కుబేర’ విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం..అక్కినేని ఫ్యాన్స్ కల ఈసారైనా నెరవేరుతుందా?