Kubera
Kubera: అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘కుబేర'(Kubera Movie). శేఖర్ కమ్ముల(Director Shekar Kammula) దర్శకత్వం లో తమిళ హీరో ధనుష్(Hero Dhanush) నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక(Rashmika mandana) హీరోయిన్ గా నటిస్తుండగా, నాగార్జున(Akkineni Nagarjuna) ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. శేఖర్ కమ్ముల సినిమాలు అంటే మన టాలీవుడ్ లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు చాలా ఆహ్లాదకరంగా, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి. చాలా ఆలస్యంగా సినిమాలు చేస్తాడు అనే కంప్లైంట్ ఉంటుంది కానీ, విడుదలయ్యాక ఆయన సినిమాలపై ఎలాంటి కంప్లైంట్ ఉండదు. నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో ఆయన చేసిన ‘లవ్ స్టోరీ’ అనే చిత్రం 2022 వ సంవత్సరం లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన మన ముందుకు రాబోతున్న చిత్రం ఇదే.
Also Read: మోక్షజ్ఞ విషయంలో బాలయ్య బ్లండర్ మిస్టేక్… అయోమయంలో నందమూరి వారసుడి కెరీర్!
ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు కాసేపటి క్రితమే మూవీ టీం ఒక శుభవార్త ని వినిపించింది. ఈ చిత్రాన్ని జూన్ 20 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి రెండు గ్లిమ్స్ వీడియోలు విడుదల అయ్యాయి. వాటికి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కోట్ల రూపాయిల ఆస్తులు గల హీరో (ధనుష్) ఎందుకు బిచ్చగాడిలా రోడ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అతను అలా మారడానికి కారణం ఏమిటి అనే అంశాలను తీసుకొని శేఖర్ కమ్ముల ఈ కథని తీర్చి దిద్దాడు. ఇందులో అక్కినేని నాగార్జున ఈడీ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. వీళ్లిద్దరి మధ్య సాగే కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుందట. శేఖర్ కమ్ముల మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయితే ఈ సినిమా సౌత్ లో ఒక సెన్సేషన్ సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అక్కినేని అభిమానులకు ఈ ఏడాది ఆరంభం చాలా అద్భుతంగా ఉంది. నాగార్జున వారసుడు నాగ చైతన్య తండేల్ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతుంది కానీ, బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోలేదు. ఫుల్ రన్ లో 95 కోట్ల రూపాయిల గ్రాస్ వద్ద థియేట్రికల్ రన్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. మూవీ టీం వంద కోట్ల రూపాయిల పోస్టర్ ని అయితే విడుదల చేసింది కానీ, ట్రేడ్ లెక్కల్లో మాత్రం ఇంకా ఆ మార్కుని అందుకోలేదు. కాబట్టి ‘కుబేర’ చిత్రంతో నాగార్జున ఈసారి వంద కోట్లు కాదు, ఏకంగా 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకుంటుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు అభిమానులు. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందో లేదో చూడాలి.