https://oktelugu.com/

Balakrishna: బాలయ్యతోనే పెట్టుకుంటారా.. దబిడ దిబిడే.. సీరియస్.. వైరల్ వీడియో

కొమరోలు గ్రామస్తులతో ఫోటోలకు దిగారు బాలకృష్ణ. తమ గ్రామానికి రావాలని వారు కోరేసరికి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. మీ గ్రామానికి రాను.. పట్టించుకోను.. ఫోటోలు దిగారుగా.. ఇక వెళ్ళండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written By: , Updated On : February 27, 2025 / 05:43 PM IST
Balakrishna (1)

Balakrishna (1)

Follow us on

Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి చెప్పనవసరం లేదు. అప్పుడప్పుడు ఆయన వ్యవహార శైలితో వార్తల్లో నిలుస్తుంటారు. ఈరోజు కూడా ఆయన సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు. ఈరోజు ఆయన కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. ఈ క్రమంలోనే కొమరవోలు గ్రామస్తులు ఫోటోలు దిగుతుండగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అంశం గా మారింది. బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ ది నిమ్మకూరు కాగా.. తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు. నిమ్మకూరులో బాలయ్య సందడి సందడిగా గడిపారు. తండ్రి గ్రామమే కాదు.. తల్లి గ్రామాన్ని కూడా పట్టించుకోరా అంటూ కొమరవోలు గ్రామస్తులు ప్రశ్నించారు. తమ గ్రామానికి రావాలని బాలకృష్ణకు విజ్ఞప్తి చేశారు.

Also Read: రాజకీయాల నుంచి రాజ్ భవన్ కు.. ఆ సీనియర్ నేత ఆశ ఫలిస్తుందా?

 

* ఫోటోలకు దిగారు చాలు అంటూ..
అయితే కొమరోలు గ్రామస్తులతో ఫోటోలకు దిగారు బాలకృష్ణ. తమ గ్రామానికి రావాలని వారు కోరేసరికి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. మీ గ్రామానికి రాను.. పట్టించుకోను.. ఫోటోలు దిగారుగా.. ఇక వెళ్ళండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా కొమరవోలు గ్రామమా? అది ఎక్కడ ఉంది అంటూ వెంకయ్యంగా మాట్లాడారు. కొమరవోలు గ్రామానికి జన్మలో రాను అని.. వాళ్లు లింగాయత్తులు.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో నందమూరి బాలకృష్ణ పై మరోసారి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: నేరుగా బెడ్ రూమ్ లోకి వచ్చి.. ఏపీ పోలీసులపై పోసాని భార్య సంచలన కామెంట్స్!

* నిమ్మకూరులో పర్యటన..
అంతకుముందు నిమ్మకూరులో బాలకృష్ణ పర్యటించారు. నందమూరి తారక రామారావు, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామస్తుల కోరిక మేరకు ఆయన నిమ్మకూరులో పర్యటించారు. గ్రామస్తులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. తన తండ్రి ఎన్టీఆర్కు త్వరలోనే భారతరత్న వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు బాలకృష్ణ. అయితే తన తండ్రి ఊరు నిమ్మకూరు గ్రామస్తులతో ఆనందంగా గడిపిన ఆయన.. తల్లి స్వగ్రామం కొమరవోలు గ్రామస్తులతో మాత్రం దూకుడుగా మాట్లాడడం విమర్శలకు తావిస్తోంది. తమ గ్రామాన్ని పట్టించుకోమని కోరినందుకు బాలకృష్ణ అలా మాట్లాడడం తమకెంతో బాధ కలిగించిందని కొమరవోలు గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో సైతం బాలయ్య తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.