Game Changer: దర్శకుడు శంకర్ ఫస్ట్ టైం ఒక టాలీవుడ్ హీరోతో మూవీ చేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలోని పాటలు అద్భుతంగా ఉన్నాయి. అయితే కేవలం సాంగ్స్ చిత్రీకరణకు శంకర్ పెట్టిన ఖర్చు తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుంది. ఆ అమౌంట్ మీ ఊహకు కూడా అందదు..
ఇండియన్ సినిమాకు భారీతనం నేర్పిన దర్శకులలో శంకర్ ఒకరు. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికత ఆయన తన సినిమాలతో పరిచయం చేసేవాడు. శంకర్ కి విజువల్ ఎఫెక్ట్స్ పై గట్టి పట్టు ఉంది. చెప్పాలంటే బాహుబలి కంటే ముందే ఆయన రోబో పేరుతో పాన్ ఇండియా మూవీ చేశారు. హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సైన్స్ ఫిక్షన్ మూవీస్ రోబో, 2.0 చిత్రాలు ఉంటాయి. ఇక శంకర్ ని పాటల చిత్రీకరణలో ప్రపంచంలోని ఏ దర్శకుడు అధిగమించలేడు. అందులో ఎలాంటి సందేహం లేదు.
శంకర్ సినిమాల్లో పాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన పాటలను చిత్రీకరించే తీరు అమోఘం. గ్రాండియర్ గా సాంగ్స్ రూపొందిస్తారు. పాటలు సైతం విజువల్ వండర్ లా ఉంటాయి. భారీతనం ప్రతి పాటలో కనిపిస్తుంది. జీన్స్, భారతీయుడు,ఒకే ఒక్కడు, అపరిచితుడు,రోబో చిత్రాల్లో సాంగ్స్ నభూతో న భవిష్యతి. శంకర్ మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలు కూడా వెనకాడకుండా ఆయన అడిగిన బడ్జెట్ సమకూరుస్తారు.
కాగా గేమ్ ఛేంజర్ చిత్రానికి సైతం పాటల కోసం శంకర్ కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. గేమ్ ఛేంజర్ సాంగ్స్ బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ సాంగ్స్ చిత్రీకరణకు శంకర్ ఖర్చు చేసిన మొత్తం రూ. 75 కోట్లు అట. అంటే ఓ స్టార్ హీరోతో సినిమా చేయవచ్చు. ఇద్దరు టైర్ టు హీరోలతో మూవీస్ చేయగల బడ్జెట్ అది.
జరగండి సాంగ్ కోసం ఒక పెద్ద విలేజ్ సెట్ వేశారు. అలాగే నానా హైరానా సాంగ్ ని అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేశారు.దోప్ లిరికల్ సాంగ్ లో రామ్ చరణ్, కియారా అద్వానీ కాస్ట్యూమ్స్, సెట్స్ కొరకు పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించారని తెలుస్తుంది. ఈ సినిమాకు ఇన్ఫ్రారెడ్ కెమెరా వాడినట్లు శంకర్ తెలియజేశాడు. గేమ్ ఛేంజర్ సాంగ్స్ బడ్జెట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దిల్ రాజు గేమ్ ఛేంజర్ చిత్రానికి నిర్మాతగా ఉన్నారు. కియారా అద్వానీ హీరోయిన్. జనవరి 10న విడుదల కానుంది.
Web Title: Do you know how many crores shankar spent on just the game changer songs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com