Prabhas And Allu Arjun: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వరుస సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియాలో స్టార్ హీరోగా అవతరించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడం విశేషం… ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. తొందరలోనే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ అప్డేట్ ని కూడా ఇవ్వడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు…ఇక బాలీవుడ్ బాద్షా గా మంచి గుర్తింపును సంపాదించుకున్న షారుక్ ఖాన్ సైతం ప్రస్తుతం వరుస సినిమాలను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరించకపోవడంతో ఆయన ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్ ఈ సినిమాతో పాన్ ఇండియాలో ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేశాడు. దాంతో ఆయనకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది…ఈ ముగ్గురిలో ప్రభాస్ స్టార్ హీరోగా వెలుగోందుతున్నాడు.
కాబట్టి వీళ్లలో ఎవరికి ఎక్కువ అభిమానులు ఉన్నారు. అనే విషయం మీద తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ కి అందరికంటే ఎక్కువ అభిమానులు ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి మంచి క్రేజ్ దక్కింది. సలార్, కల్కి 2 సినిమా తర్వాత అతనికి ఉన్న క్రేజ్ మొత్తం మారిపోయింది.
ప్రస్తుతం ప్రభాస్ కి 15 కోట్లకు పైన అభిమానులైతే ఉన్నారట… ఇక బాలీవుడ్ బాద్షా అయినా షారుక్ ఖాన్ కి 10 కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ కి 5 కోట్ల మంది అభిమానులు మాత్రమే ఉండడం విశేషం…మొత్తానికైతే ప్రభాస్ మొదటి స్థానం లో ఉన్నాడు. ఇక మీదట రాబోయే సినిమాలతో ప్రభాస్ సూపర్ సక్సెస్ లను సాధిస్తే ఆయన క్రేజ్ మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి…
