Sonu Sood: సోనూసూద్.. ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కరోనా వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా రెండే పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి కరోనా అయితే రెండోది మాత్రం సోనూసూద్. ఈ పేరును ప్రాంతాకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశం మొత్తం కీర్తిస్తూనే ఉంది. ఆపదంటే గుర్తుకు వచ్చే పేరులా ఆయన మారిపోయారు. ఎక్కడ ఎలాంటి ఆదప వచ్చినా సరే అందరూ సోనూసూద్‌కు ఫోన్ చేయడం పరిపాటిగా మారిపోయింది.

అయితే సినిమాల్లో ఒక విలన్ గా చూసే సోనూసూద్ రిలయ్ లైఫ్ లో మాత్రం హీరోగా వెలుగొందుతున్నారు. కాగా ఇంతలా పాపులర్ అయిన ఆయన గురించి కొన్ని ఆసక్లికర విషయాలు తెలుసుకుందాం. సోనూ మొదటగా.. 1999లో రిలీజ్ అయిన తమిళ మూవీ కల్లాజగార్ తో సినీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆయన విలన్ గా చేశారు. ఇందులో ఆయన గుండుతో నటించారు. ఇక తెలుగులో అయితే నాగబాబు, జయసుధ కలిసి నటించిన హాండ్స్ అప్ సినిమాలో చేశారు.
Also Read: జగన్ సర్కారుకు మిగిలింది రెండు రోజులే.. ఎటూ తేల్చకపోతే యుద్ధమే..!
ఈ మూవీలోనే మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకున్నారు. ఇక ఆయన సినీ కెరీర్‌కు 2005 పెద్ద బ్రేక్ అని చెప్పుకోవాలి. సూపర్ మూవీతో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక దీని తర్వాత ఇదే ఏడాది వచ్చిన అతడు మూవీతో ఆయన రేంజ్ బాగా పెరిగిపోయింది. దీంతో ఆయనకు హీరోలకు సమానమైన పాత్రలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇక అరుంధతి మూవీలో ఆయన చేసిన పశుపతి క్యారెక్టర్ చాలా పేరు తీసుకు వచ్చిది. ఇప్పటికీ ఈ క్యారెక్టర్ చాలా ఫేమస్.

ఇక హాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేశారు. ఆయన కేవలం శాఖహారాన్ని మాత్రమే తింటారు. మద్యం, ధూమపానం చేయరు. ఇక ఆయనకు శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంస్థ కూడా ఉంది. ఇందులో కొన్ని సినిమాలను కూడా నిర్మించారు. ఇక బ్యాట్మింటన్ స్టార్ పి.వి.సింధు జీవితం మీద తీస్తున్న బయోపిక్ ను ఆయన బ్యానర్‌లోనే తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కబోతోంది.
ఇక చివరగా.. ఆయన ఆయన సినీ కెరీర్ లో అత్యంత కీలకమైన విషయం ఉంది. మహేశ్ బాబును సూపర్ స్టార్ గా మార్చిన పోకిరి మూవీ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే ఈ మూవీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొదటగా సోనూసూద్ ను హీరోగా అనుకున్నారంట. అయితే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. కానీ మహేశ్ ప్లేస్‌లో సోనూసూద్ చేసుంటే.. ఆయన కెరీర్‌లో స్టార్ హీరోగా ఎదిగేవారేమో.
Also Read: బాలకృష్ణకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల థాంక్స్.. ఎందుకంటే?