Mass Jathara: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరో గా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర'(Mass Jathara Movie) రేపు ప్రీమియర్ షోస్ తో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా రవితేజ(Mass Maharaja Raviteja) కి సూపర్ హిట్ అవ్వడం అత్యంత కీలకం. ఎందుకంటే ‘ధమాకా’ చిత్రం తర్వాత వరుసగా ఆయన ఆరు డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్నాడు. మార్కెట్ పూర్తిగా పడిపోయింది. రవితేజ సినిమా అంటే కాంబినేషన్స్ తో సంబంధం లేకుండా థియేటర్స్ కి కదిలే మాస్ ఆడియన్స్ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు వరుస ఫ్లాప్స్ కారణంగా ఆ వర్గం కూడా ఆయన సినిమాలను చూడడం ఆపేసారు. ముఖ్యంగా అభిమానులు అయితే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ సమయం లో సోషల్ మీడియా లో రవితేజ ని ట్యాగ్ చేసి బహిరంగ లేఖలు కూడా రాశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఆయన మార్కెట్ కి డ్యామేజ్ జరిగింది.
Also Read: పవన్ కళ్యాణ్, లోకేష్ కనకరాజ్ మూవీ లో ప్రభాస్..కనీవినీ ఎరుగని రేంజ్ ప్లానింగ్!
దీంతో రవితేజ సినిమాని కొనేందుకు బయ్యర్స్ కరువైన కాలం లో కూడా ‘మాస్ జాతర’ చిత్రానికి మంచి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది అంటే నమ్ముతారా?, కానీ నిజంగానే జరిగింది. ఆ చిత్ర నిర్మాత నాగవంశీ కూడా ప్రస్తుతం గడ్డు కాలం లోనే ఉన్నాడు. ఆయన గత చిత్రాలు ‘కింగ్డమ్’, ‘వార్ 2’ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన ఫలితాలను అందుకున్నాయి. నాగ వంశీ ని నమ్మి కూడా ఈ సినిమాని భారీ రేట్స్ కి కొనే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. కానీ నాగవంశీ ఈ సినిమా ని తన బయ్యర్స్ అందరికీ ఒక స్పెషల్ ప్రీమియర్ షో వేసి చూపించాడు. తనది మినిమం గ్యారంటీ సినిమా అనే నమ్మకాన్ని కలిగించాడు. అందుకే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 31 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం.
ప్రస్తుతం ఉన్న రవితేజ మార్కెట్ కి ఈ రేంజ్ బిజినెస్ జరగడం అనేది సాధారణమైన విషయం కాదు. ట్రైలర్ ని చూస్తుంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ లాగానే అనిపిస్తుంది. కాబట్టి ఈ చిత్రం కచ్చితంగా రవితేజ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ‘ధమాకా’ చిత్రం తో మొట్టమొదటిసారి రవితేజ 100 కోట్ల గ్రాస్ ని అందుకున్నాడు. ‘మాస్ జాతర’ చిత్రం కచ్చితంగా ఆయన కెరీర్ లో రెండవ 100 కోట్ల గ్రాస్ సినిమాగా నిలుస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. మరి ఆ రేంజ్ లో సినిమా ఉంటుందా లేదా అనేది రేపు ఇదే సమయానికి తెలిసిపోతుంది. ఒకవేళ సూపర్ హిట్ అయితే రవితేజ మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్టే. ఎందుకంటే ఆయన భవిష్యత్తులో చేయబోయే సినిమాలు కూడా మినిమం గ్యారంటీ అనే విధంగా ఉన్నాయి.