Shreyas Iyer: ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా ఉపసారధి శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ఆ తర్వాత అతడిని ఆస్ట్రేలియాలోని ఆసుపత్రిలో చేర్పించారు. అతడి పక్కటెముకలకు గాయాలైనట్టు తెలుస్తోంది. పైగా అంతర్గతంగా రక్తస్రావం కూడా అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అయ్యర్ ను హుటాహుటిన అత్యవసర వైద్య విభాగంలో చేర్పించారు.
Also Read: పటిష్టంగా ఆస్ట్రేలియా.. సిరీస్ గెలవాలంటే టీమ్ ఇండియా చేయాల్సింది ఇదే!
అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్న అయ్యర్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతడు మైదానంలోకి దిగి.. బ్యాట్ చేత పట్టుకొని ఆడటానికి చాలా సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. ఇప్పటికే అయ్యర్ ను ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్ వుడ్ పరామర్శించాడు. అతడికి అత్యాధునిక వైద్యం అందుతోందని.. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పాడు. అయ్యర్ కోలుకుంటున్నాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. అయినప్పటికీ అతని ఆరోగ్య విషయంలో అభిమానులు ఆందోళనతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం గురించి అయ్యర్ కీలకమైన అప్డేట్ ఇచ్చాడు.
ఆస్పత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్న అయ్యర్.. కాస్త కోలుకున్నట్టు తెలుస్తోంది. అయితే అతడికి ఎటువంటి వైద్య విధానం లో చికిత్స అందించారో ఆస్ట్రేలియా వైద్యులు చెప్పడం లేదు. సిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అయ్యర్.. ఆరోగ్య పరిస్థితి పై అప్డేట్ ఇచ్చాడు. ” ప్రస్తుతం నేను రికవరీ అవుతున్నాను. రోజురోజుకు నా ఆరోగ్యంలో మార్పు వస్తోంది. నాకోసం చాలా వరకు శుభాకాంక్షలు వస్తున్నాయి. చాలామంది అండగా నిలుస్తున్నారు. వారందరి ప్రేమకు నేను ధన్యుణ్ణి. వారిపట్ల నేను కృతజ్ఞతా భావంతో ఉన్నాను. ఇవన్నీ కూడా నాకు చాలా విలువైనవి. వారి మనసులో నాకు చోటు ఇచ్చారు. నా గురించి ఆలోచిస్తున్నారు. వారందరికీ థాంక్స్ చెప్పుకుంటున్నాను.” అని అయ్యర్ తన ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పోస్ట్ చేశాడు.
ఇక ఇటీవల ఓ పాట కోసం నటి ఆదాశర్మతో కలిసి అయ్యర్ స్టెప్పులు వేశాడు. ప్రొఫెషనల్ డాన్సర్ మాదిరిగా అదరగొట్టాడు. అతడు డ్యాన్స్ గ్రేస్ చేసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఆదాశర్మ కూడా అతనితో పోటీపడి డ్యాన్స్ వేయడంలో విజయవంతమైంది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
— Shreyas Iyer (@ShreyasIyer15) October 30, 2025