Mahesh Babu cars : మహేష్ బాబు వద్ద ఎన్ని కోట్ల రూపాయల కార్లు ఉన్నాయో తెలుసా?

ఇది గరిష్టంగా 550 బీహెచ్ పీ పవర్ తో పాటు 540 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వీటితో పాటు మెర్సిడేస్ జీఎల్ ప్లస్, , టయోటా ల్యాక్రూయిజర్ 7 సీటర్ కార్లు ఉన్నాయి.

Written By: NARESH, Updated On : May 24, 2024 5:22 pm

Mahesh Babu cars

Follow us on

Mahesh Babu cars : టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏజ్ బార్ అయినా.. యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న ఈ మిల్క్ బాయ్ సినిమాలంటే పడి చచ్చేవారు ఎందరో ఉన్నారు. గుంటూరు కారం సినిమా తరువాత మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ గురించి ఓ న్యూస్ హాట్ హాట్ గా వైరల్ అవుతోంది. మహేష్ సాధారణంగానే లగ్జరీ లైఫ్ మెయింటేన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన వద్ద ఉన్న కార్ల గురించి కొందరు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆయన వద్ద ఎలాంటి కార్లు ఉన్నాయో చూద్దాం..

చాలా మందికి కార్ల అంటే ఇష్టం. కానీ మహేష్ బాబుకు బాగా ఇష్టం. మార్కెట్లో ఖరీదైన కారు వస్తే దానిని సొంతం చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అలా ఇప్పటి వరకుఎన్నో బ్రాండెడ్ కార్లను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు మహేష్ వద్ద ఉన్న కార్లలో రేంజ్ రోవర్ ఒటి. ఇది 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ తో నడుస్తుంది. 240 బీహెచ్ పీ పవర్ 500 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే ఈ కారు ఖరీదు రూ.3.38 కోట్లు ఉంటుంది. రేంజ్ రోవర్ కంపెనీకి చెందిన మరో కారు వోగ్ ఆటో బయోగ్రఫీ. దీని విలువ రూ.2.18 కోట్లు.

ఈ హీరో వద్ద ఉన్న మరో కారు ఇట్రీన్.. ఆడి కంపెనీకి చెందిన ఈ ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ.71 కిలో వాట్ బ్యాటరీతో పనిచేసే ఇది 308 బీహెచ్ పీ పవర్ 540 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని విలువ రూ.1.19 కోట్లు. ఇక బీఎం డబ్ల్యూ దాదాపు బిగ్ సెలబ్రీటీల దగ్గర ఉండడం కామన్. దీనిని మహేష్ కూడా సొంతం చేసుకున్నాడు. ఈ కంపెనీకి చెందిన 730 ఎల్ డీని రూ.1.30 కోట్లు పెట్టి కొన్నాడు. ఈ మోడల్ 7 సిరసీర్ లైనప్ లోని డీజిల్ ఇంజిన్ తో పనిచేస్తుంది.

బెంజ్ కారు లేని హీరో లేడనే చెప్పాలి. మరీ మహేస్ ఎందుకు ఊరుకుంటడు. మెర్సిడేస్ కంపెనీకి చెందిన బెజ్ ఈ ని కొనుగోలు చేశాడు. ఇది 281 బీహెచ్ పీ పవర్ తో పాటు 600 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ.66.99 లక్షలు పెట్టి కొన్నాడు. లంబోర్ఘిని గుల్లార్డో అనే మరో లగ్జరీ కారును కలిగి ఉన్నాడు. దీని విలువ రూ.2.80 కోట్లు. ఇది గరిష్టంగా 550 బీహెచ్ పీ పవర్ తో పాటు 540 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వీటితో పాటు మెర్సిడేస్ జీఎల్ ప్లస్, , టయోటా ల్యాక్రూయిజర్ 7 సీటర్ కార్లు ఉన్నాయి.