Heroine Saloni: హీరోయిన్ సలోని గుర్తుందా..? హీరోయిన్ శ్రీదేవి కారణంగా ఈమె జీవితం ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యపోతారు!

మర్యాద రామన్న' చిత్రం లో రాజమౌళి లాంటి దర్శకుడు 'రాయె రాయె సలోని' లాంటి సూపర్ హిట్ పాటని పెట్టించాడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఆ పాటకి సంగీతం అందించాడు. ఇది నిజంగా సలోని అదృష్టం అనే చెప్పాలి. ఆ పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. సినిమా కూడా మంచి హిట్ అయ్యింది, కానీ ఎందుకో ఆమెకి అవకాశాలు మాత్రం స్టార్ హీరోయిన్ స్థాయిలో రాలేదు. తెలుగులో అవకాశాలు తగ్గడంతో కన్నడ పరిశ్రమకి వెళ్ళింది.

Written By: Vicky, Updated On : August 30, 2024 5:07 pm

Heroine Saloni

Follow us on

Heroine Saloni: కొంతమంది హీరోయిన్లు అందంగా ఉన్నా, అద్భుతంగా నటించినా కూడా ఎందుకో అనుకున్న స్థాయి గుర్తింపు మాత్రం రాదు. వాళ్లకు బదులుగా అసలు ఏమాత్రం టాలెంట్ లేని హీరోయిన్లు స్టార్స్ గా మారడం చూసి టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ని గుర్తించకుండా ఇలాంటోళ్లకు దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తున్నారు అంటూ అప్పుడప్పుడు తిట్టుకుంటూ ఉంటాము. అలా ఇండస్ట్రీ లో తళుక్కుమంటూ మెరిసి తొందరగానే మాయమైపోయిన హీరోయిన్స్ లో ఒకరు సలోని. ఈమె పూర్తి పేరు సలోని అశ్వని. టాలీవుడ్ లోకి ఈమె సుమంత్ హీరో గా నటించిన ‘ధన 51’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ కూడా ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు బాగానే వచ్చాయి. ఈ చిత్రం తర్వాత ఆమె ‘ఒక ఊరిలో’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘మర్యాద రామన్న’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించగా, ‘బాడీ గార్డ్’, ‘రేస్ గుర్రం’ వంటి చిత్రాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేసింది.

ఈమె పేరు మీద ‘మర్యాద రామన్న’ చిత్రం లో రాజమౌళి లాంటి దర్శకుడు ‘రాయె రాయె సలోని’ లాంటి సూపర్ హిట్ పాటని పెట్టించాడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఆ పాటకి సంగీతం అందించాడు. ఇది నిజంగా సలోని అదృష్టం అనే చెప్పాలి. ఆ పాట అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. సినిమా కూడా మంచి హిట్ అయ్యింది, కానీ ఎందుకో ఆమెకి అవకాశాలు మాత్రం స్టార్ హీరోయిన్ స్థాయిలో రాలేదు. తెలుగులో అవకాశాలు తగ్గడంతో కన్నడ పరిశ్రమకి వెళ్ళింది. అక్కడ పలు సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. 2016 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన సలోని, ఆ తర్వాత 7 ఏళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు తంత్ర అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చింది. ఇదంతా పక్కన పెడితే సలోని సినిమాల్లోకి రావడానికి అసలు కారణం అతిలోక సుందరి గా పిలవబడే శ్రీదేవి అనే విషయం చాలామందికి తెలియదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాల్లోకి రాకముందు ఎన్నో డ్రామాలలో నటించేది.

ముఖ్యంగా ఈమెలో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏమిటంటే ఈమె శ్రీదేవి గొంతుని మిమిక్రీ చేయగలదు. ఈమె కంటే బాగా శ్రీదేవి గొంతు ని మిమిక్రీ చేయగల ఆర్టిస్టులు ఇండియా లో ఎవరు కూడా లేరు. అలా ఈమె స్టేజి మీద ఇచ్చిన ఒక లైవ్ మిమిక్రీ డ్రామాని చూసి సావర్ కుమార్ టక్ అనే బాలీవుడ్ దర్శకుడు తాను తీస్తున్న ‘దిల్ పరదేశి హో గయా’ చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నాడు. అలా శ్రీదేవి గొంతుని మిమిక్రీ చేయడం వల్ల సలోని జీవితమే మారిపోయింది. హీరోయిన్ గా ఎదిగి అశేష ప్రేక్షకాభిమానం పొందింది. ఈరోజు ఆమె స్టార్ హీరో కాకపోయి ఉండొచ్చు, కానీ తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేసింది. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయినా ఈమె ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టుగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరో గా నటిస్తున్న ‘మట్కా’ చిత్రం లో సలోని కీలక పాత్ర పోషిస్తుంది.