Nagarjuna: నాగార్జునకు తెలియకుండా ఆ పని చేసి బుక్ అయిన అమల… శిక్షగా ఆయన ఏం చేశాడో తెలుసా?

నాగార్జున-అమల టాలీవుడ్ క్యూట్ కపుల్ అనడంలో సందేహం లేదు. అయితే వారి మధ్య మనస్పర్థలు వచ్చాయట. నాగార్జునకు చెప్పకుండా అమల ఓ పని చేయగా ఆయన ఫైర్ అయ్యాడట. ఈ మేరకు అమల ఓ సందర్భంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Written By: S Reddy, Updated On : August 30, 2024 5:20 pm

Nagarjuna(4)

Follow us on

Nagarjuna: హీరో నాగార్జున సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కాకముందే వివాహం చేసుకున్నాడు. 1984లో ఆయన దగ్గుబాటి లక్ష్మితో ఏడడుగులు వేశాడు. లెజెండరీ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు కుమార్తె అయిన దగ్గుబాటి లక్ష్మిని నాగార్జున వివాహం చేసుకున్నారు. ఓ నాలుగేళ్లు వీరి బంధం సవ్యంగా సాగింది. అనంతరం మనస్పర్థలు తలెత్తాయి. విడాకులు తీసుకున్నారు. అప్పటికే నాగ చైతన్యకు ఆమె జన్మనిచ్చారు. నాగ చైతన్య తల్లి వద్దే పెరిగాడు. పెద్దయ్యాక తండ్రి వద్దకు వచ్చాడు. నాగ చైతన్యను నాగార్జున హీరోగా లాంచ్ చేశాడు.

విడాకులు అనంతరం నాగార్జున హీరోయిన్ అమలకు దగ్గరయ్యాడు. అమల-నాగార్జున కాంబోలో కొన్ని చిత్రాలు తెరకెక్కాయి. ఈ క్రమంలో ప్రేమలో పడ్డారు. 1992లో అమలను నాగార్జున రెండో వివాహం చేసుకున్నారు. అమల తండ్రి బెంగాలీ కాగా, తల్లి ఐర్లాండ్ మహిళ. వివాహం అనంతరం అమల సినిమాలు మానేసింది. అమల సామాజిక సేవకురాలు. ఆమెకు మూగజీవాలు అంటే చాలా ఇష్టం.

బ్లూ క్రాస్ సొసైటీలో ఆమె మెంబర్ గా ఉన్నారు. కాగా అమల ఓ సందర్భంలో నాగార్జున ఆగ్రహానికి గురైందట. నాగార్జున ఇంట్లో చాలా పెట్ డాగ్స్ ఉన్నాయి. వాటిలో లాబ్రాడర్ ఒకటి. అది అంటే నాగార్జున చాలా ఇష్టం అట. ఇంటికి రాగానే లాబ్రాడర్ నాగార్జున వద్దకు పరుగున వచ్చేదట. ఒకరోజు షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన నాగార్జునకు లాబ్రాడర్ కనిపించలేదట. దాంతో పెట్ డాగ్ ఏమైందని అమలను నాగార్జున అడిగారట.

లాబ్రాడర్ ని ఒక నెల రోజుల పాటు ట్రైనింగ్ కి పంపించాను అని అమల సమాధానం చెప్పిందట. ఆ మాట విన్న నాగార్జున షాక్ అయ్యాడట. తనకు చెప్పకుండా ట్రైనింగ్ కి ఎందుకు పంపావని అమలను ప్రశ్నించాడట. తీవ్ర నిరాశకు గురైన నాగార్జున అమలతో మాట్లాడటం మానేశాడట. దాదాపు 10 రోజులు అమలతో నాగార్జున మాట్లాడలేదట. అనంతరం లాబ్రాడర్ కి ట్రైనింగ్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్న అమలతో గతంలో మాదిరి మాట్లాడారట.

ఈ విషయాన్ని అమల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. మరోవైపు నాగార్జున తన 75వ చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. అలాగే రెండు తమిళ చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తున్నాడు. రజినీకాంత్-లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ చిత్రంలో నాగార్జున ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఆయన బర్త్ డే పురస్కరించుకుని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నాగార్జున లుక్ ఆకట్టుకుంది. అలాగే ధనుష్-శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కుతున్న కుబేర చిత్రంలో ఆయన నటిస్తున్నారు. నాగార్జున అప్ కమింగ్ చిత్రాలపై ఆసక్తి నెలకొని ఉంది.