https://oktelugu.com/

Raksha Gowda : సీరియల్ లో స్మార్ట్.. రియల్ గా హాట్.. ‘గుప్పెడంత మనసు’నటి షాకింగ్ స్టిల్స్..

సీరియల్ లో మెయిన్ రోల్ లో రిషి, వసుధార పాత్రలో నటించిన వారు సందడి చేశారు. అయితే ఇందులో వసుధార పాత్రలో నటించింది రక్షా గౌడ్. ఈమె గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఎందుకంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : August 30, 2024 / 05:05 PM IST

    Raksha Gowda

    Follow us on

    Raksha Gowda : ఒకప్పుడు టీవీ సీరియల్ అంటే చిన్న చూపుచూసేవారు. కేవలం మహిళలు మాత్రమే వీటికి ఎక్కువగా ఆదరించేవారు. ఇందులో నటించడానికి కొందరికి అవకాశం వచ్చినా వదులుకొని వెండి తెర వైపు వెళ్లే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమాల కంటే ఎక్కువగా సీరియళ్లు ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకుంటున్నాయి. సీరియళ్లలోనూ కావాల్సిన కామెడీ, యాక్షన్, ఫైట్స్, సెంటిమెంట్ ఉంటున్నాయి. దీంతో కొందరు మొగవారు సీరియళ్ల ఫ్యాన్స్ అయిపోయారు. అంతేకాకుండా సీరియల్ లో ఛాన్స్ వస్తే చాలు.. సెటిలైపోతామని కొందరు అనుకుంటున్నారు. అందుకే ఏ సిరియల్ ఛాన్స్ వచ్చినా వదులుకోవడం లేదు. అలా అవకాశం తెచ్చుకున్న ఓ నటి ఇప్పుడు స్టార్ అయిపోయింది. అయితే ఆమె సీరియల్ లో ఎంతో పద్ధతిగా, సాంప్రదాయంగా కనిపించింది. కానీ బయట చూస్తే మాత్రం షాక్ అవుతారు. ఇంతకీ ఎవరామె? ఏ సీరియల్ లో నటిస్తోంది?

    తెలుగులో ప్రసారమవుతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ గురించి ఏ మహిళ అడిగినా చెబుతుంది. ఒక సినిమా స్టైల్లో మేకింగ్ చేసిన ఈ ధారావాహిక ఎండ్ కార్డుకు దగ్గర పడుతోంది. రిషి అనే పాత్ర చుట్టూ సాగిన ఈ సీరియల్ త్వరలో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సీరియల్ లో మెయిన్ రోల్ లో రిషి, వసుధార పాత్రలో నటించిన వారు సందడి చేశారు. అయితే ఇందులో వసుధార పాత్రలో నటించింది రక్షా గౌడ్. ఈమె గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఎందుకంటే?

    రక్షాగౌడ బెంగుళూరుకు చెందిన అమ్మాయి. ఈమె అక్కడే పుట్టి చదువు పూర్తయిన తరువాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత సినిమాలపై ఆసక్తి ఉండేది. అయితే ‘రాధా రమణ’ అనే కన్నడ సీరియల్ తో బుల్లితెరపై మొదటిసారిగా కనిపించింది. ఆ తరువాత తెలుగులో ‘కృష్ణవేణి’ అనే సిరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ రెండు సీరియల్ ద్వారా ఆమెకు గుర్తింపు రాలేదు. వీటి తరువాత పోషించిన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ తో ఫేమస్ తెచ్చుకున్నారు రక్షా గౌడ.

    గుప్పెడంత మనసు సీరియల్ లో వసుధార పాత్రలో పోషించిన రక్షా గౌడ అమాయకంగా కనిపిస్తారు. దాదాపు హీరోయిన్ లెవల్లో ఆమె పాత్ర ఉంటుంది. ఇందులో హీరో పాత్రలో నటించి రిషికి భార్యగా వసుధార ఉంటుంది. అమాయకంగా కనిపిస్తూనే ఒక్కోసారి కోపంగా ఉంటూ షాక్ ఇస్తుంది. అయితే ఈమెకు ఫ్యాన్స్ అయిపోయిన చాలా మంది ఆమె తెలుగు అమ్మాయే అనుకున్నారు. కానీ ఈమె బయట మాత్రం హాట్ హాట్ గా కనిపిస్తూ యూత్ కు షాక్ ఇస్తుంది. రక్షా గౌడ కు సంబంధించిన లేటేస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ అయ్యాయి. వీటిని చూస్తూ కుర్రాళ్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే రక్షాగౌడ త్వరలోనే బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుకే ఆమె నటిస్తున్న సీరియల్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఏదీ ఏమైనా రక్షాగౌడను చూసి షాక్ అవుతున్నారు.