Naveen Patnaik Health: నవీన్ పట్నాయక్ ఆరోగ్యంతో బిజెపి ఆటలు..? అసలు కారణం అదేనంటా..!

నవీన్ పట్నాయక్ ఆరోగ్యం బాగాలేదని..ఆయన హెల్త్ బాగా లేకపోవడానికి గల కారణాలను తాము అధికారంలోకి వస్తే విచారిస్తామని ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు.

Written By: Neelambaram, Updated On : May 30, 2024 4:08 pm

Naveen Patnaik Health

Follow us on

Naveen Patnaik Health: దేశవ్యాప్తంగా ఈసారి అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయస్థాయిలో ఆయా రాష్ట్రాల్లో వేయని పాచికలు అంటూ లేవు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీల అగ్ర నేతలను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు బిజెపి అధినాయకత్వం అనేక రకాల ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటివరకు ఆరు దశలు పూర్తికాగా..ఈ అన్ని దశల్లోనూ ప్రాంతీయ పార్టీల నేతలను పొలిటికల్ గా వీక్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏడవ దశ ఎన్నికల ప్రచార సందర్భంగా ఒడిస్సా లోనూ బిజెడి అధినేత,ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ పాచిక వేశారు.

నవీన్ పట్నాయక్ ఆరోగ్యం బాగాలేదని..ఆయన హెల్త్ బాగా లేకపోవడానికి గల కారణాలను తాము అధికారంలోకి వస్తే విచారిస్తామని ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఒడిస్సా బిజెపి శాఖ మీడియాకు విడుదల చేసింది. ఇందులో నవీన్ పట్నాయక్ వణుకుతున్నట్లు వీడియోలో ఉంది. ఆ వీడియోను నవీన్ పట్నాయక్ సన్నిహిత వ్యక్తి పాండియన్ తీసినట్లుంది. పాండియన్ ఓ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఈయనే బిజెడిని నడుపుతున్నారు. ఒడిస్సాలో బీజేడీకి సంబంధించిన రాజకీయ కార్యకలాపాల్లో కూడా పాండియన్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు.

దీంతో ఇప్పుడు ఇదే వ్యవహారాన్ని బిజెపి ఒడిస్సా ఎన్నికల ప్రచారంలో బిజెడిని రాజకీయంగా కార్నర్ చేసేందుకు వాడుకుంటుంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఇలాగే ఉంటే నవీన్ పట్నాయక్ కు బదులు ఒడిస్సా కు తమిళనాడుకు చెందిన పాండియనే ముఖ్యమంత్రి అవుతారంటూ..బిజెపి ప్రచారం చేసింది. అందువల్ల ఈసారి బిజెపిని ఆదరిస్తే నవీన్ పట్నాయక్ అనారోగ్యానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ చేస్తామంటూ చెబుతోంది. అయితే బిజెపి చేసిన ఈ విమర్శలు పరోక్షంగా పాండియన్నే ఉద్దేశించి చేసినవి కావడంతో..తమ పార్టీలో ఎలాంటి ముసలం పుట్టకుండా నవీన్ పట్నాయక్ కూడా కమలనాథులకు గట్టి కౌంటరే ఇచ్చారు. ఒడిస్సాలో బిజెపి తమతో పొత్తు పెట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసిందని..ఆ పార్టీ అర్హతకు మించిన ఎక్కువ సీట్లను కోరిందని..మేము అంగీకరించకపోవడంతో ఇప్పుడు ఎన్నికల ప్రచార సందర్భంగా భాజపా అగ్ర నేతలు తప్పుడు క్యాంపెనింగ్ కు పూనుకుంటుండడం ఆశ్చర్యం కలిగిస్తుందంటూ..కౌంటర్ అటాక్ చేసేశారు.