https://oktelugu.com/

Chhatrapati Chandrasekhar’s Wife: ఛత్రపతి చంద్రశేఖర్ భార్య టాలీవుడ్ లో ఎంత పెద్ద నటి తెలుసా..?

Chhatrapati Chandrasekhar’s Wife: దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలను మాత్రమే కాదు..ఆయన సినిమాల్లో నటించే నటీనటులను కూడా అంత తేలికగా మనం మరచిపోలేము..స్టూడెంట్ నెంబర్ 1 నుండి మొన్న విడుదలైన #RRR వరుకు ఆయన సినిమాల్లో ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్టు చంద్ర శేఖర్ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే..రాజమౌళి కి బాగా దగ్గరైన మనుషులలో చంద్ర శేఖర్ కూడా ఒక్కరు..చంద్ర శేఖర్ రాజమౌళి తో చేసిన సినిమాలలో ఛత్రపతి సినిమా ద్వారా ఆయనకీ బాగా గుర్తింపు వచ్చింది..ఈ సినిమాలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2022 / 11:03 AM IST
    Follow us on

    Chhatrapati Chandrasekhar’s Wife: దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలను మాత్రమే కాదు..ఆయన సినిమాల్లో నటించే నటీనటులను కూడా అంత తేలికగా మనం మరచిపోలేము..స్టూడెంట్ నెంబర్ 1 నుండి మొన్న విడుదలైన #RRR వరుకు ఆయన సినిమాల్లో ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్టు చంద్ర శేఖర్ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే..రాజమౌళి కి బాగా దగ్గరైన మనుషులలో చంద్ర శేఖర్ కూడా ఒక్కరు..చంద్ర శేఖర్ రాజమౌళి తో చేసిన సినిమాలలో ఛత్రపతి సినిమా ద్వారా ఆయనకీ బాగా గుర్తింపు వచ్చింది..ఈ సినిమాలో ప్రభాస్ కి స్నేహితుడిగా చంద్ర శేఖర్ నటన ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేలా చేస్తుంది..కేవలం రాజమౌళి సినిమాలలో మాత్రమే కాదు..ఈయన ఇతర డైరెక్టర్ల సినిమాల్లో కూడా ఎక్కువగా చేసాడు..ఒక్క పక్క క్యారక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో బిజీ గా గడుపుతూనే మరోపక్క సీరియల్స్ కూడా చేస్తున్నాడు చంద్ర శేఖర్..ఇక ఇటీవల విడుదలైన #RRR సినిమా ద్వారా ఆయనకీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది..జూనియర్ కి ఎన్టీఆర్ కుడి భుజం గా మంచి బరువైన పాత్రనే పోషించాడు చంద్ర శేఖర్..ఇది ఇలా ఉండగా చంద్ర శేఖర్ వ్యక్తిగత జీవితం గురించి ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి..అవేమిటో ఇప్పుడు మనం చూద్దాము.

    Chandrasekhar

    Also Read: Director Trivikram Srinivas: కొత్త హీరోయిన్ మోజులో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్

    ఇక అసలు విషయానికి వస్తే చంద్ర శేఖర్ గారి భార్య ఎవరో కాదు..సౌత్ ఇండియా లోనే మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న నీలియా భవాని గారే..ఈమె ఇప్పటి వరుకు టాలీవుడ్ లో కిక్ 2 , సై రా నారా సింహ రెడ్డి , పండగ చేసుకో, నాని జెంటిల్ మ్యాన్ ఇలా ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించింది..ఇక కోలీవుడ్ లో అయితే ఈమె అక్కడి స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అజిత్ మరియు విజయ్ సినిమాలలో కూడా నటించింది..సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందే చంద్ర శేఖర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది..అప్పట్లో చంద్ర శేఖర్ కి ఎలాంటి ఉద్యోగం లేకపోవడం తో వీళ్లిద్దరి పెళ్ళికి ఇంట్లో పెద్దలెవ్వరు ఒప్పుకోలేదు..దీనితో ఇంట్లో వారికి తెలియకుండా లేచి హైదరాబాద్ కి వచ్చేసారు..హైదరాబాద్ కి వచ్చిన తర్వాత బ్రతుకు తెరువు కోసం చంద్ర శేఖర్ చాలా తీవ్రంగా కష్టపడుతున్నాడు..అలా తెలిసిన వాళ్ళ ద్వారా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న శాంతి నివాసం అనే సినిమాలో ఒక్క చిన్న పాత్రని పోషించే అవకాశం దక్కింది..అలా ప్రారంభమైన చంద్ర శేఖర్ కెరీర్ నేడు మనం చూస్తున్న రేంజ్ కి సాగింది..ఇక తన భార్య నీలియా కి సినిమాలు మీద ఆసక్తి ఉండడం ని గమనించిన చంద్ర శేఖర్ ఆమెని ఇండస్ట్రీ లోకి తీసుకొని రావడం లో మంచి ప్రోత్సాహం ని అందించాడు..అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా విడిపోవాలిసి వచ్చింది..ఇక ఈ దంపతులు ఇద్దరికీ ఒక్క కొడుకు మరియు ఒక్క పాప ఉన్నారు..ప్రస్తుతం వీళ్లిద్దరు నీలియా భవాని తోనే ఉంటున్నారు..కూతురు పూజిత అపోలో మెడికల్ కాలేజీ లో మెడిసిన్ చేస్తుండగా, కొడుకు మహేశ్వరన్ క్రికెటర్ గా స్థిరపడాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

    Chandrasekhar, Neelya

    Also Read: Nayanthara Honeymoon: హనీమూన్ కి నయనతార – విఘ్నేశ్ లు ఎంత ఖర్చు చేసారో తెలుసా??

    Tags