https://oktelugu.com/

Nayanthara Honeymoon: హనీమూన్ కి నయనతార – విఘ్నేశ్ లు ఎంత ఖర్చు చేసారో తెలుసా??

Nayanthara Honeymoon: సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార జూన్ 9 వ తేదీన తన ప్రియుడు విఘ్నేష్ తో మహాబలిపురం లోని షెరటాన్ రిసార్ట్ లో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వివాహ మహోత్సవానికి మీడియా ని దూరం పెట్టేసారు..అంతే కాకుండా పెళ్లి ప్రాంగణం లో ఎవ్వరు వీడియోలు తియ్యకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు..ఎందుకంటే వీళ్లిద్దరి పెళ్లి వీడియో ని నెట్ ఫ్లిక్స్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2022 / 10:48 AM IST
    Follow us on

    Nayanthara Honeymoon: సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార జూన్ 9 వ తేదీన తన ప్రియుడు విఘ్నేష్ తో మహాబలిపురం లోని షెరటాన్ రిసార్ట్ లో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వివాహ మహోత్సవానికి మీడియా ని దూరం పెట్టేసారు..అంతే కాకుండా పెళ్లి ప్రాంగణం లో ఎవ్వరు వీడియోలు తియ్యకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు..ఎందుకంటే వీళ్లిద్దరి పెళ్లి వీడియో ని నెట్ ఫ్లిక్స్ OTT సంస్థ కొనుగోలు చేసింది..అతి త్వరలోనే ఈ వివాహ మహోత్సవం రెండు భాగాలుగా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది..అందుకే వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన చిన్న వీడియో కూస్తో బయటకి రాకుండా జాగ్రత్త పడ్డారు..ఇక ఈ వివాహ మహోత్సవం ని ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఎంతో అందంగా చిత్రీకరించారట..మరో విశేషం ఏమిటి అంటే ఈ పెళ్ళికి ఇటు నయనతార కానీ అటు విఘ్నేష్ కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదట..ఈ పెళ్లికి అయినా ఖర్చు భారాన్ని మొత్తం నెట్ ఫ్లిక్స్ కంపెనీ వారే భరించారట..ఒక్క పెళ్లి చెయ్యాలంటే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు ఎంతో కష్టపడాల్సి వస్తుంది..భారీ మొత్తం మీద డబ్బులు కూడా కూడగట్టి ఖర్చు చెయ్యాల్సి వస్తుంది..కానీ టాప్ సెలబ్రిటీ అయినా కారణంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గ్రాండ్ గా వివాహం చేసుకోవడం అంటే సినిమా తారగా పుట్టడం ఒక్క అదృష్టం లాంటిది అని ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది.

    Vignesh, Nayanthara

    Also Read: Mahesh Babu Daughter Sitara: మహేష్ బాబు కూతురు సీతార కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా??

    ఇక వీళ్ళు హనీమూన్ కోసం ఇటీవలే బ్యాంకాక్ కి వెళ్లారు..అక్కడ ప్రస్తుతం వీళ్ళు ఒక్క ఖరీదైన హోటల్ లో నివాసం ఉంటున్నారట..ఈ హోటల్ లో అయితే మధ్యతరగతి వ్యక్తికీ ఒక్క రోజు గడపడానికి సుమారు రెండు నుండి మూడు లక్షల రూపాయిలు ఖర్చు అవుతుంది..కానీ సెలెబ్రటీలు ఇక్కడ ఉండాలనుకుంటే మాత్రం వారికి అన్నీ ఉచితం అట..ఎందుకంటే సెలెబ్రిటీల వల్ల హోటల్ కి పబ్లిసిటీ ఒక్క రేంజ్ లో వస్తుంది..అందులో నయనతార వంటి స్టార్ హీరోయిన్ ఆ హోటల్ లో ఒక్క నెల రోజులు ఉంటె దాని డిమాండ్ వేరే లెవెల్ కి వెళ్తుందని హోటల్ మ్యానేజిమెంట్ అంచనా..అలా నయనతార పెళ్లి మరియు హనీమూన్ రూపాయి ఖర్చు లేకుండా జరిగిపోయింది..ఇక వీళ్లిద్దరు ఇండియా కి తిరిగిరాగానే సినిమాలతో ఫుల్ బిజీ కానున్నారు..నయనతార ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తో గాడ్ ఫాదర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమాతో పాటుగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరో గా నటిస్తున్న ‘జవాన్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది..ఈ రెండు సినిమాలతో పాటు నటనకి ప్రాధాన్యం ఉన్న రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట నయనతార.

    Nayanthara, Vignesh

    Also Read: Director Trivikram Srinivas: కొత్త హీరోయిన్ మోజులో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్

    Tags