https://oktelugu.com/

Geetha Bhaskar Son: ‘ఫిదా’ లో సాయి పల్లవి కి అత్తగా చేసిన ఈమె కొడుకు టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ డైరెక్టరో తెలుసా..!

ఆరోజుల్లోనే ఈ సినిమా 48 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ చిత్రం లో హీరోయిన్ సాయి పల్లవి క్యారెక్టర్ మరియు ఆమె నటన చిత్రానికే హైలైట్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు, సౌత్ లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

Written By:
  • Vicky
  • , Updated On : July 13, 2023 / 02:03 PM IST

    Geetha Bhaskar Son

    Follow us on

    Geetha Bhaskar Son: లవ్ స్టోరీస్ లో క్లాసిక్ స్టేటస్ తో పాటుగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ ని దక్కించుకున్న చిత్రాలలో ఒకటి ఫిదా. వరుణ్ తేజ్ సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి వరుణ్ తేజ్ మీ హీరో గా నిలబెట్టింది. అప్పటి వరకు కెరీర్ లో ఒక్క సక్సెస్ కూడా లేక ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్ కెరీర్ కి ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ మామూలుది కాదు.

    ఆరోజుల్లోనే ఈ సినిమా 48 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ చిత్రం లో హీరోయిన్ సాయి పల్లవి క్యారెక్టర్ మరియు ఆమె నటన చిత్రానికే హైలైట్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు, సౌత్ లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

    ఇక ఈ సినిమా సాయి పల్లవి కి అత్తగా నటించిన గీత భాస్కర్ ని అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. చేసింది చిన్న పాత్రనే అయ్యినప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే రేంజ్ పాత్రనే చేసింది. ఈమె మరెవరో కాదు, ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ కి తల్లి. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘పెళ్లి చూపులు’ వంటి యూత్ ఫుల్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని తీసిన తరుణ్ భాస్కర్ కి టాలీవుడ్ లో ఒక బ్రాండ్ ఇమేజి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

    ఇక పోతే ఆయన తల్లి గీత భాస్కర్ కేవలం ఫిదా లో మాత్రమే కాదు కళ్యాణ్ రామ్ ‘118 ‘, ‘ఈ నగరానికి ఏమైంది’ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ వంటి చిత్రాలలో కూడా ముఖ్య పాత్రలు పోషించింది. భవిష్యత్తులో కూడా ఈమె సినిమాల్లో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.